Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని వక్రీకరిస్తున్న బీజేపీ
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య
- తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 75వ వార్షికోత్సవ సభ
నవతెలంగాణ - డోర్నకల్
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సెప్టెంబర్-17 ఎర్రజెండా కమ్యూనిస్టుల వారసులదేనని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య అన్నారు. తెలంగాణ రైతంగా సాయుధ పోరాట 75వ వార్షికోత్సవ సభ మండల పరిధి పెరుమండ్ల సంకీసా గ్రామంలో పార్టీ నాయకులు బొబ్బ వెంకటరెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ముందుగా ఎస్సీ కాలనీ వద్ద నాటి నైజాం సైన్యాలు కాల్సి చంపిన 21 మందికి నివాళులర్పించి అక్కడ నుండి ర్యాలీగా గ్రామకూడలిలో నిర్మించిన అమరవీరుల స్థూపం వద్ద పుచ్చలపల్లి సుందరయ్య దళ నాయకుడు తుమ్మ శేషయ్యకు నివాళులర్పించారు. అనంతరం స్వాతంత్య్ర సరయోధులు కొత్త రంగారెడ్డి, మందాసు శీలమ్మ, బొబ్బ యశధమ్మ, శెట్టి తారమ్మ, సుధనపు ఆదమ్మ, పరిపాటి వరమ్మ, రామగాని బారతమ్మ, సిద్ధోజ్ ఉప్ప మ్మలను పార్టీ గ్రామ శాఖ అధ్వర్యంలో సన్మానించారు. అనంతరం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌తో కలిసి నాగయ్య మాట్లాడారు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చి న ఎనిమిదేండ్లలో ప్రజలపై అనేక భారాలు మోపిం దన్నారు. 1946 సెప్టెంబర్ 11 నుంచి 1951 అక్టోబర్ 21 వరకు సాగిన సాయుధ పోరాటానికి కమ్యూ నిస్టులు నాయకత్వం వహించారన్నారు. ఈ పోరాటానికి ఎలాంటి సంబంధం లేని బీజేపీ నేడు సెప్టెంబర్ 17న విమోచన దినంగా జరపాలని అనడం సిగ్గుమాలిన చర్య అన్నారు. 1946లో భూస్వాముల ఆగడాలను చాకలి ఐలమ్మ తిప్పి కొట్టిందని, నిజాం సైన్యం కాల్పుల్లో దొడ్డి కొమరయ్య తొలి అమరుడు అయ్యారని తెలిపారు. ముస్లింకు చెందిన బందగినీ నిజాం సర్కార్ పొట్టన పెట్టుకున్నారని తెలిపారు. నిజాంరాజు 1500 మందిని, హౌంశాఖ మంత్రిగా ఉన్న సర్దార్ వల్లభారు పటేల్ సైన్యం 2500 మందిని పొట్టన పెట్టుకున్నా ఈ పోరాటం ఆగలేదని తెలిపారు. నాడు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి కౌలుదారు చట్టం తెచ్చిందని, అట్లాగే దున్నేవాడికి భూమి కావాలని భూసంస్కరణల చట్టాన్ని చేస్తామని ప్రకటించిందన్నారు. ఈ నేపథ్యంలో 1951 అక్టోబర్ 21 కమ్యూనిస్టులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం విరమింప చేశారని తెలిపారు. ఎర్రజెండా నాయకత్వంలో సాగిన చారిత్రక పోరాటాన్ని ఆ నాట్టి చరిత్రను భవిష్యత్ తరాలకు అందించడం నేటి పాలకులకు ఇష్టం లేదని విమర్శించారు. చరిత్రకు వక్రభాషను చెబుతూ రాజకీయ ప్రయోజనాల కోసం బిజెపి వాడుకునే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఆలస్యంగా నైన టీిఆర్‌ఎస్ ప్రభుత్వం మేల్కొని తెలంగాణ వారోత్సవ సభలు నిర్వహిస్తామని ప్రకటించడం అభినందనీయమన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు శెట్టి వెంకన్న, జిల్లా నాయకులు అంగోత్ వెంకన్న, మండల కార్యదర్శి ఉప్పన పల్లి శ్రీనివాస్, మండల నాయకులు జాగర్లమూడి ప్రసాద్, మల్లేశం, గ్రామ కార్యదర్శి గండు రవి, సంకీస,జోగ్యా తండా సర్పంచ్‌లు బొబ్బ లక్ష్మి అంగోత్ సరోజ పాల్గొన్నారు.
కురవి : వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులు అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు నాగయ్య అన్నారు. కురవి మండల కార్యదర్శి మల్లాడి కోటయ్య అధ్యక్షతన శుక్రవారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్స వాలు జరిగాయి. కురవిలో రైతాంగ పోరాట వారోత్సవాల్లో భాగంగా స్థానిక బస్‌స్టాండ్ నుంచి ఓం ఫంక్షన్ హాలు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆకుల రాజుతో కలిసి నాగయ్య మాట్లాడారు. నల్లపు సుధాకర్, షేక్ మల్సూర్, పిట్టల వెంకన్న, జక్కుల మల్లయ్య, జంగ ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.
అమరవీరుల స్ఫూర్తితో ముందుకు సాగుదాం
కురవి : అమరవీరుల స్ఫూర్తితో ముందుకు సాగుదామని గిరిజన సంఘం జిల్లా నాయకులు మాలోత్ కిషన్‌నాయక్ పిలుపునిచ్చారు. శుక్రవారం వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా అమర వీరులకు ఘన నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిషన్‌నాయక్ మాట్లాడారు. ఈ సాయుధ పోరాటంలో పది లక్షల ఎకరాల భూమిని పేదలకు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో పంపిణీ చేశారన్నారు. దేశంలో హిందూ ఎజెండా పేరుతో బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలు రెచ్చగొడుతోందన్నారు. మండల అధ్యక్షులు బానోత్ సీతారాంనాయక్, బానోత్ శంకర్, వాంకుడోత్ రమేష్ నాయక్, దేవా, బాలాజి, చందు, చిన్న, రవి , తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సాయుధ పోరాట వారసత్వానికి పునాది ఎర్రజెండా : సాదుల శ్రీనివాస్
నెల్లికుదురు : తెలంగాణ సాయుధ పోరాట వారస త్వానికి పునాది ఎర్రజెండా అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ అన్నారు. నెల్లికుదురు మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో శుక్రవారం తోట నర్సయ్య అద్యక్షతన తెలంగాణ రైతాంగ సాయుధ పొరాట వారొత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సాయుధ పొరాటంలో లక్షలాది ఎకరాల భూమి పంపిణీ చేయడంలో ముఖ్య పాత్ర పొషించిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదేనని అన్నారు. మహ త్తరమైన చరిత్ర కలిగిన ఈ పోరాటాన్ని వక్రీకరిస్తున్న బీజేపీకి తగిన గుణపాటం చెప్పాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కిరానికి ఎర్రజెండాయే మార్గామని అన్నారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గునగంటి రాజన్న, మండల కార్యదర్శి పెరుమాండ్ల తిలక్, మండల నాయకులు ఇసంపెల్లి సైదులు, బాబుగౌడ్, సత్యనారాయణ, పుల్లయ్య. వెంకన్న, యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.