Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలి
- జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి
నవతెలంగాణ-జనగామ
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వా రోత్సవాల ముగింపు సందర్బంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొననున్నారు. నేడు(శనివారం) ఉదయం 12 గంటలకు స్థానిక రైల్వే స్టేషన్ నుండి నెహ్రు పార్కు, అంబేద్కర్ చౌరస్తా మీదుగా ప్రెస్టన్ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సంద ర్భంగా ముగింపు సభ నిర్వహించనున్నారు. సీతారాం ఏచూరి పాల్గొని ప్రసంగిస్తారు.
నేడు జనగామ జిల్లా కేంద్రంలో నిర్వ హించే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు సందర్బంగా సిపిఎం భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి కోరారు. బహిరంగ సభకు సంబంధించిన కార్యక్రమాల ఏర్పాట్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. జనగామ జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 10 నుండి సెప్టెంబర్ 16 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు గ్రామగ్రామాన జీపుజాతా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సంద ర్భంగా అమర వీరులను స్మరించు కుంటూ నాటి పోరాటాలను గుర్తుచేసుకుంటూ, అమ రుల పోరాట స్తూపాలను సందర్శించి నివాళులు అర్పిస్తూ అమరుల కుటుంబాలను కలిశామన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా సెప్టెంబర్ 17న జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జనగామ పట్టణంలోని ప్రెస్టన్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించ నున్నట్లు తెలిపారు. ఈ సభకు సీపీఐ(ఎం) అఖిల భారత ప్రధానకార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి ముఖ్య అతిధిగా హాజరు కానున్నారని తెలిపారు. సభకు రైతు, కార్మిక, విద్యార్థి, యువత, మహిళా, వాణిజ్య వ్యాపార, కవులు, కళాకారులు, మేధావులు, ప్రజాతంత్ర ఉద్యమ అభిమానులు, సబ్బండ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎదునూరి వెంకట్రాజం, బోట్ల శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు పోత్కనూరి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.