Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
ఎల్ఐసీ పాలసీదారుల, ఏజెంట్ల ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ నిరవధిక సమ్మె చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో లియాఫీ-1964 జాతీయ కమిటీ, జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుమేరకు శుక్రవారం తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని ఎల్ఐసి కార్యాలయం ముందు ఎల్ఐసీ ఏజెంట్లు గేటు ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా లియాఫీ-1964 మహబూబాబాద్ బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి పాశం రమేష్ మాట్లాడారు. ఎల్ఐసి పాలసీలపై జీఎస్టీ రద్దు చేయాలని, పాలసి దారులకు బోనస్ రేట్లు పెంచాలని, ఐదు సంవత్సరాలకు పైగా బకాయి పడిన ల్యాబ్స్ పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. పాలసీదారులు,ఏజెంట్లు కార్యాలయంలో అందజేసే ఏ విధమైన డాక్యుమెంట్లకైనా రసీదు ఇవ్వాలన్నారు. ఏజెంట్లను ప్రొఫెషనల్ గా గుర్తించాలని వారి పిల్లలకు ఎడ్యుకేషన్ అడ్వాన్స్ ఇవ్వాలని అన్నారు. ఏజెంట్ల మెడి క్లయిమ్, టర్మ్ ఇన్సూరెన్స్ పంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ డివిజన్ ఈసీ మెంబర్ రేగూరి వెంకన్న, మహబూబాబాద్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు బాణాల బిక్షపతి, కార్యవర్గ సభ్యులు ఇటికేల రాంబాబు, నాగేశ్వరరావు,ఎల్ల గౌడ్, హరికృష్ణ,యాకన్న, మల్లికార్జున్, వెంకన్న, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.