Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎదురొడ్డి పోరాడిన (కమ్మరి బుచ్చయ్య) నాన్నే స్ఫూర్తి
- స్వరాష్ట్రంలో.. ఇకనైనా బతుకులు బాగుపడాలె..
- తెలంగాణ ఉద్యమకారుడు, మెకానిక్ పెద్దోజు వెంకటాచారి
నవతెలంగాణ-హనుమకొండ
'నాటి రజాకార్ల దౌర్జన్యాలు.. ఇంటేనే కన్నీళ్లు వచ్చేటియి.. నిజామ్ రజాకార్లకు ఎదురొడ్డి పోరాడిన నాన్న కమ్మరి (పెద్దోజు) బుచ్చయ్యే నాకు స్ఫూర్తి.. తెలంగాణను సాధించుకుని ఏండ్లు గడుస్తున్న తరుణంలో ఇకనైనా పేదల బతుకులు బాగుపడాలె..' అని హనుమకొండ లష్కర్బజార్ మెకానిక్ (మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలంలోని కందికొండ గ్రామ వాస్తవ్యుడు) పెద్దోజు వెంకటాచారి ఆకాంక్షిస్తున్నాడు. సెప్టెంబర్ 17ను రాజకీయ పార్టీలు ఒక్కో తీరుగా గుర్తిస్తుండగా 'నవతెలంగాణ'తో మెకానిక్ చారి (వెంకటాచారి) శుక్రవారం ప్రత్యేకంగా మాట్లాడారు. నిజామ్ ఆగడాలను, వాటిని ఎదుర్కొన్న తీరును అతడి తండ్రి బుచ్చయ్య చిన్నతనంలో తనకు వివరించిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. రైతులు, కార్మికులు, అన్ని తరగతుల ప్రజలు నిజామ్ ఆగడాలకు బలయ్యారని వాపోయాడు. గర్భిణులు, బాలింతలు, మైనర్ బాలికలు, వృద్ధులన్న విచక్షణను కూడా మరచి నిజామ్ దుర్మార్గాలకు తెగబడ్డాడని వివరించాడు.
అధికారంలో ఉద్యమ పార్టీ.. ఇకనైనా బతుకులు బాగుపడాలె..
నిజామ్ నుంచి తెలంగాణకు విముక్తి లభించింది. అయినా దశా బ్దాల పాటు వలసవాదుల పాలన లో తెలంగాణ ప్రజలకు బానిస బతుకులు తప్పలేదు. ఎట్టకేలకు కేసీఆర్ నాయకత్వంలో వందలాది మంది యువకులు, విద్యార్థులు ప్రాణాలకు తెగించి పోరాడడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. ఉద్యమ పార్టీగా తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఎనిమిదేండ్లు గడిచాయి. అనేక ఆశలు.. ఆకాంక్షలు ఇంకా నెరవరలేదు. ఆరుగాలం కష్టించినా రైతన్నకు, కార్మికులకు మూడు పూటలా బువ్వ దొరకని దుస్థితి ఉంది. ఎమ్మెల్యే వినరుభాస్కర్ ప్రభుత్వ చీఫ్ విప్ అయ్యారు. అన్ని తరగతుల ప్రజల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం, వినయన్న పాటుపడుతున్నారు. ఇకనైనా కార్మికుల, పేదల బతుకులు బాగుపడాలె..