Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్
నవతెలంగాణ-సుబేదారి
జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పండుగలా జరుపుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. హన్మకొండ జిల్లాలో విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ విభాగాల ఆధ్వర్యంలో కుడా గ్రౌండ్ నుంచి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వరకు శుక్రవారం నిర్వహించిన మహార్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన సభలో వినయ్‌భాస్కర్ మాట్లాడారు. జాతీయ సమైక్యతా స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పండుగ వాతావరణంలా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను జరుపుకుంటున్నామని అన్నారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వస్తే తెలంగాణ ప్రాంతానికి 1948 సెప్టెంబర్ 17న వచ్చిందన్నారు. నాటి త్యాగధనుల ఫలితం బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నరని తెలిపారు. వారి స్ఫూర్తితోనే గాంధేయ మార్గంలో కెసిఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత భారత దేశంలో నే అన్ని రంగాలలో అభివద్ధి సాధిస్తున్నామన్నారు. ప్రపంచ మేధావి డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ కలలు నిజం చేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన సెక్రటేరియట్ కు అంబేడ్కర్ పేరు ను అసెంబ్లీలో తీర్మానం చేశామని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆర్టికల్ 3 ద్వారానే సాధించుకున్నమన్నారు. హన్మకొండ జిల్లాలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అనేక కొట్ల ర్షుపాయలతో అనేక అభివృద్ధి పనులు చేసానన్నారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్యంలోకి వచ్చి 75వ సంవత్సరంలోకి అడుగిడుతున్న తరుణంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు జరుపుకుంటున్నామని తెలిపారు. వరంగల్ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి మాట్లాడుతూ 75 సంవత్సరాల ముందు తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాలు ఉంటే ఇప్పుడు 33 జిల్లాలతో పటిష్టమైన పోలీస్ వ్యవస్థ, ఫ్రెండ్లీ పోలీసింగ్ సేవలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని చెప్పారు. కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావిణ్య, మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అజీజ్ ఖాన్, డీసీపీ అశోక్, ఆర్డీవో వాసుచంద్ర, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.