Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దళిత బాంధవుడు అంబేద్కర్ పేరును నూతన సచివాలయానికి పెట్టాలన్న సీఎం కేసీఆర్ దళితుల పక్షపాతిగా నిలిచాడని సర్పంచ్ కడెం యాకయ్య, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు డోనుక ఉప్పలయ్య అన్నారు. మండల పరిధి అమ్మాపురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. టీిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ముద్దం వీరారెడ్డి, రైతు జిల్లా సమితి సభ్యులు తమ్మెర వీరభద్రరావు, డొనున సైదుల్, రాము, కాత్తూర్ రమేష్ , గుంటుక వెంకటేష్, వివిధ ప్రజా, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.