Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సభాస్థలిలో జాతీయ జెండాలే నీడగా..
- అసౌకర్యానికి లోనైన మహిళలు, విద్యార్థులు
నవతెలంగాణ - స్టేషన్‌ఘన్‌పూర్
నియోజకస్థాయిలో 15వేలమందితో ఏర్పాటు చేసే జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ప్రభుత్వ అధికారులు చేపట్టిన ఈ ఏర్పాట్లకు తూట్లు పొడిచే పరిస్థితి కొట్టొచ్చినట్లు కనిపించింది. శుక్రవారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజక వర్గ కేంద్రంలో 7మండలాలకు గానూ జరిగిన వేడుకల్లో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య పాల్గొన్నారు. కేవలం అతిథులకు మాత్రమే టెంట్ వేశారు. కాగా సభా స్థలి ప్రాంగణంలో, సమావేశ ప్రారంభం నుంచి వచ్చిన వారంతా, నిలువ నీడ లేక అనేక ఇబ్బందులు పడ్డారు. కొందరూ మహిళలు, విద్యార్థులైతే ఎండ వేడిమి తట్టుకోలేక ప్రసంగం మధ్యలోనే తిరిగి వెళ్ళారు. తాగేందుకు నీటి సదుపాయం కూడా లేకపోవటంతోమహిళలకు అనేక అవస్థలు పడ్డారు. తీవ్రమైన ఎండలో కూర్చుని, తలపై చీరకొంగులు కప్పుకుని, మరి కొందరైతే జాతీయ జెండాను నీడగా తలిచి, పళ్లెంలు సైతం నీడగా మార్చుకుని కొద్ది మంది మాత్రమే, తప్పదన్నట్లుగా ప్రసంగాలు విన్నారు. కనీసం నీడ కోసం టెంట్, నీటి సదుపాయం లేకపోవడంతో, ర్యాలీలో పాల్గొని, సభాస్థలి వద్దకు చేరుకోగా ఏలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో అక్కడి వారంతా అసహనం వ్యక్తం చేశారు.