Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుబంధు సమితి రాష్ట్రఅధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ - స్టేషన్‌ఘన్‌పూర్
బానిసత్వానికి ఎదురొడ్డి పోరాడిన గడ్డ, కన్న పిల్లల్ని నడుము కట్టుకొని పోరాడిన ఈప్రాంతంలో గుజరాతీ గులాంలను తీసుకొచ్చేందుకు చూస్తున్నారని, చెప్పులు మోసే గులాంగిరీ వ్యవస్థ ఇక్కడ నడువదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నియోజక వర్గంలో జాతీయ సమైఖ్యత వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్య తన క్యాంపు కార్యాల యంలో జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమా వేశంలో వారు మాట్లాడారు. ఆత్మగౌరవం పోరాట పటి మగలిగిన ఈ గడ్డలో మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టే పార్టీలకు అవకాశం లేదని అన్నారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, రాజ మల్లయ్య, ధర్మబిక్షం, అరుట్ల కమలాదేవి, రామచంద్రారెడ్డి, నల్లా నర్సిం హులు, రావి నారాయణరెడ్డి, మల్లు స్వరాజ్యం నాటి పోరాట కర్తలుగా నిలిచారని, ఈక్రమంలో 4వేల మంది అమరులయ్యారని అన్నారు. దున్నేవాడిదే భూమి అంటూ, బానిసత్వం పోవాలని ఉద్యమ పాటలు రచించి సాహిత్య రూపాల్లో ఉద్యమం జరిగిందన్నారు. 2001- 14 వరకు కేసీఆర్ నాయకత్వంలో కుల, మతాలక తీతంగా, అహింసా మార్గంలో ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకోగా, నాటికి, నేటికీ ప్రజా సంక్షేమంలో ముందంజలో ఉన్నామని అన్నారు. రాష్ట్రంలో అందిస్తున్న ఫలాలు, బిజేపి పైసల అంటున్నారు.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దేశంలో కళ్యాణ లక్ష్మి కింద, లక్ష రూపాయల సాయం చేయడమే గాక, రాష్ట్రవ్యాప్తంగా సాగునీరు, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, ఉచిత కరెంటు అందిస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ అన్నారు. ఈ ప్రాంతంలో ఎత్తుగా ఉన్న శ్రీపతిపల్లి, కొండాపూర్, లింగంపల్లి, ధర్మసాగర్లో మల్లక్‌పల్లి, ధర్మాపురం, వేలేరులో ముప్పారం, నారాయణగిరి వంటి 15 గ్రామాలకు సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ తో మాట్లాడి 100 కోట్ల నిధులుు మంజూరు చేశామని అన్నారు. నియోజకవర్గంలో రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఏర్పాటు కూడా వచ్చే వారం లోపే మొదలవుతున్నట్లు తెలిపారు. తెలంగాణకు కేసీఆర్ ఉండడం వల్లే దళిత బందు ద్వారా ఈ సంవత్సరంలో నియోజకవర్గానికి 1500మంది దళిత కుటుంబాలకు మేలు జరుగనున్నట్లు తెలిపారు. ఇదంతా చూసి ఓర్వలేక బీజేపి అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు. పంటల తెలంగాణ కావాలో, మంటల తెలంగాణ కావాలో ప్రజలే ఆలోచిం చుకుని కేసీఆర్ నాయకత్వాన్ని ఆశీర్వదిస్తున్నారని అన్నారు. అంబేద్కర్ పేరు తెలంగాణ సచివాలయానికి నామకరణం చేయడం గొప్ప విశేషమన్నారు. సెప్టెంబర్ 17 రాచరిక ప్రజాస్వామ్య వ్యతిరేక దినంగా గుర్తిస్తూ, సబ్బండ వర్గాలకు మేలు చేకూరేలా, రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు. ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ జాతీయవాదాన్ని పెంపొందించే దిశగా రాష్ట్ర ప్రజలందరూ కేసీఆర్ అండగా నిలవాలని కోరారు. వజ్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపుని చ్చారు. ఈ సందర్భంగా కవులు, కళాకారులు, సాంస్కృ తిక, స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రాంరెడ్డి, తహసీల్ధార్ పూల్ సింగ్ చౌహాన్, ఎసీపీ రఘుచందర్, నియోజక వర్గ ఎంపీపీలు, జెడ్పీటీసీలు ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.