Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
సమైక్యతతోనే సుస్థిరాభివృద్ధి సాధ్యమని, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు శుక్రవారం పట్టణంలో ఘనంగా జరిగాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నుండి ఎన్టీఆర్ స్టేడియం వరకు వివిధ కళా ప్రదర్శ నలతో భారీ ఎ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎనిమిదేళ్లలో అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రంలో గణనీయమైన అభివృద్ధి సాధించామని అన్నారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తున్నదని తెలిపారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో 44 వేల మందికి ఆసరా పెన్షన్ అందిస్తున్నామని త్వరలోనే పేదవారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వడంతో పాటు స్థలం కలిగిన వారు ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలు అందిస్తామని తెలిపారు. ఆరోగ్య లక్ష్మి ద్వారా మహిళలకు పౌష్టికాహారం అందిస్తున్నామని, రైతులకు మద్దతు ధర కల్పించి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని అన్నారు. ధరణి ద్వారా దీర్ఘకాలిక భూ సమస్యలకు పరిష్కారం చూపి పట్టా పాస్ పుస్తకాలను అందిస్తున్నామని అన్నారు. జిల్లా కలెక్టర్ కె.శశాంక మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్స వాలను మూడు రోజులపాటు నిర్వహిస్తుందన్నారు. జెడ్పీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు, మున్సిపల్ చైర్మెన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి ఎస్పీ శరత్ చంద్ర పవార్, ట్రెయినీ కలెక్టర్ పరమర్ పిన్కేశ్వర కుమార్ లలిత్ కుమార్, అదన కలెక్టర్ ఎం డేవిడ్, డీఆర్డీఓ సన్యాసయ్య, ఆర్డీవో కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.