Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురు కుల పాఠశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్ ) మండల కార్యదర్శి మామిడి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కెవిపిఎస్ ఆధ్వర్యంలో పాఠ శాలను సందర్శించి, పాఠశాలలో నెలకొన్న సమస్యల గురిం చి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేవని, మరుగుదొడ్లు, స్నానపు గదులు సరిపోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, శిథిలావస్థలో ఉన్న భవ నంలో అనారోగ్యంతో గురైన విద్యార్థులను ఉంచుతున్నా రని, స్నానాలకు వాడే నీటినే విద్యార్థులు త్రాగునీరుగా విని యోగిస్తున్నారని, దీంతో విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని అన్నారు. విద్యార్థులకు యూని ఫామ్ పంపిణీ చేయలేదని, ఇంటర్మీడియట్ విద్యార్థులకు సరిపడా పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదని, విద్యార్థులకు అందించే కాస్మోటిక్ బిల్లులు రెగ్యులర్గా ఇవ్వకుండా, మూడు నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుందని, ఒక్కొక్క గదిలో 40 మంది విద్యార్థులు ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పట్టించుకోవడం లేదని కెవిపిఎస్ నాయకులు ప్రశ్నించారు. తక్షణమే గురుకులాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం మండల ఉపాధ్యక్షులు బొట్ల కుమార్, నాయకులు సుమన్, సునిల్, రవి, రాజు పాల్గొన్నారు.