Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి
నవతెలంగాణ-పరకాల
సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్య్ర దినంగా ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అన్నారు. స్థానిక అమరధామంలో నిజం నవాబుల పాలనలో అసువులు బాసిన అమరవీరులకు శుక్రవారం శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ పెసర్ విజయచందర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడారు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ తెలంగాణ ప్రాంతం నిజం ఆధీనంలో ఉండి ఈ ప్రాంత ప్రజలను అనేక చిత్రహింసలకు గురి చేయడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. నాటి హోమ్ శాఖ మంత్రి సర్దార్ వల్లభారు పటేల్ జోక్యంతో నిజాం నవాబులతో 1948 సెప్టెంబర్ 17న పోరాటం జరిగిందని, ప్రతిఫలంగా రాష్ట్రానికి స్వతంత్ర ప్రకటిస్తానని రాష్ట్రంలో ఆయా ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన ప్రకటించక పోవడం బాధాకరమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాయమాటలతో సెప్టెంబర్ 17న స్వతంత్ర దినంగా అధికారికంగా ప్రకటిస్తానని వాగ్దానం చేసిన నేటికి ప్రకటించకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా సెప్టెంబర్ 17ను అధికారికంగా స్వతంత్ర దినంగా ప్రకటించాలని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందని అన్నారు. ప్రజలతో వ్యతిరేకత వస్తుందనే భావనతో జాతీయ సమైక్యత దినం జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యేలు వంటేరు జైపాల్, శ్రీరాములు, సత్యనారాయరెడ్డి, నాయకులు గుజ్జ సత్యనారాయణ, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, డాక్టర్ సిరంగి సంతోష్‌కుమార్, మేఘనాథ్, కౌన్సిలర్లు భద్రయ్య, పూర్ణాచారి, తదితరులు పాల్గొన్నారు.