Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు వాహనాలు స్వాధీనం-ఒకరు పరార్
నవతెలంగాణ-కాజీపేట
ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న దొంగను పోలీసులు అదుపులోకి తీసుకుని 4 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్టు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. మరొకరు పరారీలో ఉన్నట్టు ఆయన చెప్పారు. కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో సీఐ గట్ల మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. మచ్చాపూర్ గ్రామానికి చెందిన ధ్యగాల యోగి, కాజీపేట ప్రగతినగర్ ఆదర్శ కాలనీకి చెందిన మంగలి ప్రకాష్ తమ బైక్‌లు చోరీకి గురయ్యాయంటూ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు ఆదివారం ఉదయం కాజీపేట శాంతినగర్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన భువనగిరి జిల్లాలోని న్యూరాంనగర్ నివాసి (ధర్మసాగర్ వాస్తవ్యుడు) కళ్లెపు శివను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా చోరీలను అంగీకరించారు. శివ అతడి మిత్రుడు అనిల్‌తో కలిసి చోరీలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. శివ మీద గతంలో 10 చోరీ కేసులున్నాయని, అతడు జైలు జీవితం గడిపాడని ఏసీపీ వివరించారు. పోలీసులు శివ నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోగా అనిల్ పరార్ అయ్యాడు. విచారణలో ప్రతిభ కనబర్చారంటూ ఎస్సైలు వెంకటేశ్వర్లు, రవికుమార్, కానిస్టేబుల్ సదానందం, భాస్కర్లను ఏసీపీ అభినందించి రివార్డు అందించారు.