Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ చేతుల మీదుగా చిన్నారికి నామకరణం
- ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి చొరవతో..
నవతెలంగాణ-భూపాలపల్లి
తమ బిడ్డకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పేరు పెట్టాలన్న ఆ దంపతుల 9 ఏండ్ల కల ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి చొరవతో ఎట్టకేలకు నెరవేరింది. వివరాలిలా ఉన్నాయి.. భూపాలపల్లి మండలంలోని నందిగామకు చెందిన జనగామ సురేష్ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. జనగామ సురేష్-అనిత దంపతులకు 2013లో కూతురు జన్మించింది. ఈ క్రమంలో తమ కూతురుకు ఉద్యమ రథసారథి, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నామకరణం చేయాలని సురేష్-అనిత దంపతులు నిశ్చయించుకున్నాడు. కాగా పరిస్థితులు అనుకూలించకపోవడంతో తమ కూతురుకు పేరు పెట్టకుండానే పెంచుతున్నారు. ఈ విషయాన్ని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్సీ మధుసూదనాచారి సమక్షంలో ప్రగతిభవన్లో సురేష్-అనిత దంపతుల కూతురుకు సీఎం కేసీఆర్ 'మహతి'గా నామకరణం చేసి ఆశీర్వదించారు. అనంతరం నరేష్ దంపతులకు సీఎం దంపతులు బట్టలు పెట్టి సంప్రదాయ పద్ధతిలో ఆతిథ్యం అందించారు. అలాగే మహిత చదువు కోసం ఆర్థికసాయం అందించారు. తమ తొమ్మిదేండ్ల కల ఫలించడంతోపాటు ఊహించని రీతిలో సీఎం దంపతులను ఆదరించడంతో సురేష్ దంపతులు సంబ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఈ విషయమై సీఎం దంపతులకు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారికి సురేష్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.