Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఐనవోలు
అర్హులైన గొల్లకుర్మలకు గొర్రెలను పంపిణీ చేసే బదులు నగదు బదిలీ చేయా లని జీఎంపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి, సర్పంచ్ బండి పర్వతాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ హాలులో మండల అధ్యక్షుడు పిడుగు దయాకర్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన మండల కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా పర్వతాలు హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 7 లక్షల 31 వేల 368 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసినా ఇప్పటివరకు 3 లక్షల 91 వేల 388 ఇంకా 3 వేల 39 980 పంపిణీ చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య 21 వేల 236 కాగా అందులో 7 వేల 340 మందికి పంపిణీ చేయాల్సి ఉందని చెప్పారు. సదరు పథకం లబ్దిదారులకు కాకుండా దళారులకు, కొందరు పశువైద్యులకు ఉపయోగపడుతోందని ఆందోళన వెలి బుచ్చారు. నిబంధనల మేరకు యూనిట్‌కు 21 గొర్రెలు ఇవ్వాల్సి ఉన్నా కేవలం 10-15 మాత్రమే ఇచ్చారని చెప్పారు. అందులోనూ ముసలి, నాసిరకం గొర్రెలు ఇచ్చి ఆర్థికంగా నష్టం చేశారని మండిపడ్డారు. ఈ స్కీమ్ ద్వారా గొల్లకుర్మలను కోటీశ్వరులకు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఊదరగొట్టగా గొల్లకుర్మలు అప్పుల పాలయ్యారని ఆందోళన వెలిబుచ్చారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అవినీతిని నిర్మూలించేలా గొల్ల కుర్మలకు బ్యాంకు ఖాతాలో నగదు బదిలీ చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సంఘం మండల కార్యదర్శి నల్లబెట్ట చిన్న రాజు మాట్లాడుతూ గొర్లకు, మేకలకు వ్యాధి నివారక టీకాలు వేసేందుకు గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు నాయిని శ్రీకాంత్, బోయిని రాజు, మండల ఉపాధ్యక్షుడు ఉడుత చేరాలు, పిడుగు కొమురయ్య, పెద్దబోయిన రాజు, కావటి బద్వేలు, బజ్జీలు నల్లబెట్ట వెంకటయ్య, శ్రీనివాస్, ఉడుత భాస్కర్, ఉడుత కత్తుల కుమార్, సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.