Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
- స్వాతంత్ర సమరయోధులకు, కళాకారులకు సన్మానం
నవతెలంగాణ-భూపాలపల్లి
సంస్కతిని ప్రతిబింబించేలా సాంస్కతిక కార్యక్రమాలు జరిగాయని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం ఇల్లందు క్లబ్లో నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాలు, స్వాతంత్ర సమరయోధుల, కళాకారుల సన్మాన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని, మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరాణి, అదనపు కలెక్టర్ దివాకర్లతో కలిసి పాల్గొన్నారు. కళాకారులు సాంస్కతిక కార్యక్రమాలకు అతిధులకు ఉన్నతాధికారులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. కళాకారులు, చిన్నారుల ప్రదర్శనలను ఆద్యంతం తిలకించిన అతిథులు, ఆహ్వనితులు కరతాళధ్వనులతో అభినందించారుదేశభక్తి గేయాలు, జానపద గీతాల పై విద్యార్థులు చేసిన ప్రదర్శనలు అందరినీ అలరించాయి. తెలంగాణ సాంస్కతికి సారథి కళాకారుల తమ ప్రదర్శనలతో థూందాం నిర్వహించారు. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన ప్రదర్శనలను అతిధులు పెద్ద సంఖ్యలో హాజరైన ఆహుతులు పూర్తిగా లీనమై ప్రతి కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తిగా తిలకించారు. కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ ఆగస్టు మాసంలో 15 రోజుల పాటు దేశ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నామని, ప్రస్తుతం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు 3 రోజుల పాటు అధికారులు ప్రజలు ప్రజాప్రతినిధుల సహకారంతో విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ తెలిపారు. జిల్లా కేంద్రంలో 15 వేల పైగా ప్రజలతో వారి ర్యాలీ నిర్వహించాము, సెప్టెంబర్ 17 న సీఎం కేసీఆర్ హైదరాబాదులో నిర్వహించిన ఆదివాసి గిరిజన ఆత్మీయ సమీపన కార్యక్రమంలో జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారని తెలిపారు. ఈ రోజు సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వాతంత్ర సమరయోధులను, కళాకారులను సన్మానించుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. సాంస్కతిక కళలు, పాటలు చాలా విలువైనవని, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి కావడంలో సాంస్కతిక సారథి కళాకారులు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు సైతం ప్రధాన కారణమని కలెక్టర్ తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా తమ కళలను వినియోగించాలని, ఎప్పటికప్పుడు నైపుణ్యాన్ని పెంచుకుంటే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని కలెక్టర్ సూచించారు. ప్రతి రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, మన జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలను కచ్చితంగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం నిరంతరం శ్రమిస్తుందని కలెక్టర్ ప్రశంసించారు. జిల్లాలో విద్యపై అధిక శ్రద్ధ వహిస్తున్నామని , నూతన మెడికల్ కళాశాలలో అనుబద్ధ ఆసుపత్రిని ప్రభుత్వం మంజూరు చేసిందని, అదే విధంగా 141 ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు మనబడి కార్యక్రమాలు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న నూతన సెక్రటేరియట్ భవనానికి భారతరత్న డాక్టర్ అంబేద్కర్ భవన్ అని నామకరణం చేసినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కళా ప్రదర్శనలు చేసిన కళాకారులను విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. కార్య క్రమంలో అదనపు కలెక్టర్ దివాకర మున్సిపల్ చైర్ పర్సన్ వెంకట్రాణి గ్రంధా లయ సంస్థ చైర్మన్ రమేష్, ఆర్డీవో పురుషోత్తం, డీఆర్వో శ్రీనివాస్, డీపీఆర్వో శ్రీధర్, జిల్లా అధికారులు, స్వాతంత్ర సమరయోధులు, ఫిల్మి డైరెక్టర్ రాజమహే దామోదర్ కళాకారులు, పాఠశాలల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.