Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్ఎస్ఎస్, బిజెపి కుట్రలను తిప్పి కొట్టాలి
- పోరాటాలతోనే గుడిసెలను సాధించుకుంటాం
- కేంద్ర కమిటీ సభ్యులు జి. నాగయ్య
నవతెలంగాణ-వరంగల్
తెలంగాణ రాష్ట్రంలో వీర తెలంగాణ రైతంగ సాయుధ పోరాట ఫలితమే వెట్టిచాకిరి నుండి విముక్తి కలిగిందని సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య అన్నారు. శనివారం నిర్వహించిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల బహిరంగ సభ సిపిఐ (ఎం) రంగ శాయి పేట ఏరియా కార్యదర్శి మాలోతు సాగర్ అధ్యక్షతన సభ నిర్వహించారు. ముఖ్య అతిథులు గా సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య, ప్రత్యేక ఆహ్వానితులు సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య హాజరయ్యారు. సిపిఐ( ఎం) వరంగల్ జిల్లా కార్యదర్శి సిహెచ్ రంగయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు చుక్కా ప్రశాంత్, కెవిపిఎస్ రంగశా యిపేట ఏరియా కార్యదర్శి ఉసిల్ల కుమార్, ప్రజానాట్యమండలి జిల్లా దుర్గయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ వీరయ్య మాట్లాడుతూ సెప్టెంబర్ 17 చరిత్రలో ప్రత్యేకతను సంతరించుకుందన్నారు. ఇంతకాలం బిజెపి విమోచన దినాన్ని ఎందుకు నిర్వహించలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం గద్దెన ెక్కడం కోసం కులాల్లో మతాల్లో చిచ్చుపెట్టి ఎన్నికల ఓట్ల కోసం ఇప్పుడు విమో చన దినం అంటూ ఉత్సవాలు జరుపుతున్నారన్నారు. ఆర్ఎస్ఎస్, బిజెపి మోసపూరితమైన కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. తెలంగాణలో భాగమైన టు వంటి హైదరాబాదులో ఉన్న నిజాంతో ఒప్పందం చేయించుకున్నది సర్దార్ వల్లభారు పటేల్ సైన్యం, ఒకవైపు దేశ స్వాతంత్రం కొరకు అందరూ పోరాడు తుంటే ఆర్ఎస్ఎస్ ఎక్కడుందని విమర్శించారు. స్వాతంత్రం పోరాటంలో వారి పాత్ర ఏమిటి అని ప్రశ్నించారు. ఆనాడు పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వారి పోరాట ఫలితంగానే ఈనాడు వెట్టి చాకిరి వ్యవస్థ విముక్తి కలిగి, మహిళలపై దాడులు జరగడం లేదని గుర్తు చేశారు. కమ్యూనిస్టులు వచ్చిన తర్వాతనే వారు భయపడి దొరలు పారిపోయారన్నారు. ఇప్పటివరకు తెలంగాణలో 10 లక్షల ఎకరాల ప్రభుత్వం, దొరల భూములను పేదలు దున్నుకుంటున్నారు. అంటే దీని వెనకాల కమ్యూనిస్టు పార్టీ ఉందనీ అన్నారు. చరిత్ర చెప్పే వాస్తవాలను పక్కనపెట్టి హైదరాబాదులో విలీనమైనటువంటి రోజు బిజెపి నాయకులు మా త్రం దీన్ని విమోచన దినోత్సవంగా చేసుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం అప్పుడు జరిగిన పోరాటం కేవలం హిందువులకు ముస్లింలకు జరిగిన గొడవ అని, హిందువులను ముస్లింలకు గొడవ పెట్టే ప్రయత్నం చేస్తు న్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ తెలంగాణ జాతీయ సమైక్యమైన దినోత్స వం గా పండుగలు చేసుకుంటున్నారు అది మంచిదే కానీ, సీఎం ఎక్కడ మాట్లా డిన భారత దేశంలో తెలంగాణ విలీనమైన రోజు దీని కమ్యూనిస్టులు చేసిన పోరాట ఫలితమే వచ్చిందని తెలిపాలి. తెలంగాణలోని సమస్యలు అన్నిటినీ పరిష్కరించాలని లేకపోతే ఆ సమస్యల పరిష్కారంలో వరంగల్లోని గుడిసె వాసుల నుండి ప్రారంభం కావాలన్నారు. భవిష్యత్తులో తీసుకునే నిర్ణయానికి కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య మాట్లా డుతూ తెలంగాణ పోరాటంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పోరాటాలు చేశారు. బైరంపల్లిలో 96 మందిని నిజాం రాజుల సైన్యం, భూస్వాములు కలిసి చంపడం జరిగిందని, కమ్యూనిస్టు పార్టీ ముందుండి పోరాడిందన్నారు. ప్రభు త్వానికి ఐదు డిమాండ్లు అడుగుతున్నా, ప్రభుత్వ స్థలాల్లో వేసుకున్న గుడిసెలకు పట్టాలివ్వాలి. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి. సొంత స్థలం ఉంటే రూ.5 లక్షల ఇచ్చి ఇల్లు కట్టి నిర్మించాలని, ప్రభుత్వ స్థలాలను బడా నాయకులైన అక్రమదారుల చేతుల్లోంచి తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో రంగశా యి పేట సిపిఎం పార్టీ ఏరియా కమిటీ సభ్యులు డి సాంబమూర్తి, చుక్క ప్రశాం త్, ఎం ప్రత్యూష, ఎం జ్యోతి, టి.రత్నం, లక్క రమేష్, ఎస్ దాసు, బి కృష్ణ, గనిపాక ఓదెలు,సందీప్, సన్నీకుమార్ ప్రజా నాట్య మండలి అనిల్ పాల్గొన్నారు.