Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉచితాలంటూ ప్రజా సంక్షేమ పథకాల అడ్డు దుర్మార్గం..
- బీజేపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే పెద్ది ఆగ్రహం
నవతెలంగాణ-నర్సంపేట
బోరు మోటార్లకు మీటర్లు బిగించేందుకు కేంద్ర ప్రభు త్వం చేస్తున్న కుట్రలను రైతులు తిప్పికొట్టాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పాత ముగ్ధుంపురం, ముగ్థుంపురం, రాజపల్లె, గురిజాల, చిన్న గిరి జాల, గుంటూరుపల్లె, జీజీఆర్పల్లి, లక్నెపెల్లి, రామవరం, మహేశ్వరం, ముత్తోజిపేట గ్రామాలలో 984 మంది పిం ఛన్ లబ్దిదారులకు మంజూరు, గుర్తుంపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ల అధ్యక్ష తన నిర్వహిం చిన కార్యక్రమంలో కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వంపై ఎమ్మె ల్యే నిప్పులుకక్కారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆత్మగౌ రవం, అస్థిత్వం కోసం పోరాడి సాధించుకున్న తెలం గాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తుందన్నారు. 60 యేండ్లు కోల్పోయిన నష్టాన్ని పూడ్చడానికి సాగు నీటి ప్రాజె క్టులను నిర్మించి సంక్షేమాభివృద్ధిని అమలు చేస్తుండగా కేం ద్రం ఉచిత పథకాలు ఇవ్వొద్దంటూ అడ్డుపడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికే ఆంధ్రలోని శ్రీకా కు ళం జిల్లాలో మోటర్లకు మీటర్లు అమర్చిందని గుర్తు చేశా రు. ఇది దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్రం సంస్క రణలను మొదలుపెట్టబోతుందనడానికి నిదర్శమ న్నారు. బోరుబావులపై ఆధారపడి సేధ్యం చేస్తున్న తెలంగాణ రైతులకు కేంద్రం ఉరితాళ్లను బిగించబోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు మేల్కొని కేంద్రం కుట్రలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. మరో వైపు గోదా వరి నదిపై సాగు నీటి ప్రాజెక్టులకు అడ్డు గోడగా నిలిచిందని కాళేశ్వరంతో పాటు పాకాల ఎత్తిపో తలకు అనుమతి లేదం టూ రైతుల పొలాల్లోకి వస్తున్న గోదావరి జలాలను నిలిపి వేసిందని తెలిపారు.ఉచితాలు ఇవ్వొద్దంటూ సంక్షేమ పథకాలను అడ్డుకునే యత్నం చేస్తుందన్నారు.ఈ కుట్రలపై గ్రామాల్లో చర్చ పెట్టాలే.. తెలంగాణ సమాజం ఏకమై తిప్పి కొట్టాలన్నారు. కేంద్రం ఎన్ని అడ్డంకులు, అవరోధాలు సృష్టిం చినా సీఎం కేసీఆర్ ఎదురొడ్డి సంక్షేమ పథకాలను అమలు చేసితీరుతారని తెలి పారు. ఇందుకు కేసీఆర్ను ప్రజలు నిండు మనస్సుతో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. పింఛ న్లకు అర్హత ఉన్న వారం దరు ధరఖాస్తులు ఇవ్వాలని వారందరికి ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ నిచ్చారు. అన్ని గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లను పూర్తి చేసే వచ్చే ఎన్నికల్లో ఓట్లడుగుతానని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోతె కలమ్మ, జెడ్పీటీసీ కోమండ్ల జయమ్మ, సర్పం చ్లు నామాల సత్యనారాయణ, పెండ్యాల జ్యోతి, గొడిశాల మమత, గొడిశాల రాంబాబు, కొడారి రవి, మాడుగుల కవి త, గోలి శ్రీనివాసరెడ్డి, తదితర ఎంపీటీసీ, పీఏసీఎస్ చైర్మన్ తదితర ప్రజాప్రతినిధులు, ఇన్చార్జి ఎంపీడీవో సునిల్ కుమార్, పంచాయతీ కార్యదర్శిలు పాల్గొన్నారు.