Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుండెపోటుతో మృతి చెందిన రామురావు
- పార్థివ దేహాన్ని సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి, ప్రముఖ ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ-మట్టెవాడ
మాజీ మంత్రి తక్కెళ్లపల్లి పురుషోత్తంరావు తనయుడు, తెలంగాణ జనవేదిక కన్వీనర్ రాము (58) ఆదివారం తెల్ల వారుజామున గుండెపోటుతో కన్నుమూశాడు. రాము హఠా న్మరణంతో వరంగల్ జిల్లాలో విషాదఛాయలు అలుము కున్నాయి. రాముకు భార్య వినీత్, కుమారుడు శ్రీకర్ ఉన్నారు. వరంగల్ హంటర్ రోడ్డులోని రాము నివా సంలో పార్థివదేహాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సం దర్శించి శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులను ఓదా ర్చారు. ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, నన్నపనేని నరేందర్, దాస్యం వినరు భాస్కర్, వరంగల్ హనుమకొండ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, వివిధ మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పార్థివ దేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.
తనకంటూ ప్రత్యేక గుర్తింపు...
కాంగ్రెస్ పార్టీ శిక్షణ శిబిరాల ఇన్చార్జిగా పనిచేస్తున్న ఆయన విద్యార్థి దశలో ఎన్ఎస్యూఐలో చేరి అప్పటి నుం చి పార్టీలో కొనసాగుతున్నారు. విద్యార్థిగా సుధీర్ఘ కాలంగా ఎన్ఎస్యూఐ నాయకుడి స్థాయి నుంచి పనిచేస్తున్నారు. తండ్రి పురుషోత్తంరావు నాలుగుసార్లు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికి తనకంటూ కాంగ్రెస్‌లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. జనవేదిక కన్వీనర్‌గా పేరు సంపాదిం చుకు న్న ఆయన బోధించు, సమీకరించి, ఉద్యమించు నినాదంతో దేశ వ్యాప్తంగా వివిధ రంగాల ప్రముఖులతో వర్తమాన, రాజ కీయ, సామాజిక, అంశాలపై సదస్సులు నిర్వహించే వారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పార్టీశ్రేణులు తమ ఆవేదనను వెలిబుచ్చారు.
రాము రావు మృతి పట్ల సంతాపం
పర్వతగిరి : మాజీ మంత్రి, మండలంలోని కొంకపాక గ్రామానికి చెందిన పురుషోత్తమరావు కుమారుడు రాము రావు ఆదివారం మృతి చెందగా మండల ప్రజలు తీవ్ర దిగ్బ్రాంతి చెందారు. మండలంలోని పలు పార్టీల నాయ కులు, ప్రముఖులు, ప్రజలు వరంగల్‌లోని ఆయన నివా సానికి వెళ్లి సంతాపం తెలిపారు. రామురావు మృతి పార్టీకి తీరని లోటని పలువురు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.