Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
జిల్లా కేంద్రంలో దసరా పండుగ సందర్బంగా ఏర్పాటు చేసే రావణవధ కార్యవర్గ కమిటీని ఆది వారం జిల్లా కేంద్రంలో ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. కార్యక్రమ నిర్వహణ కమిటీ అధ్యక్షులుగా గండ్రకోట కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి అధ్యక్షులు మాట్లాడుతూ గతంలో 17 ఏళ్ల పాటు రావణవధ ఉత్సవాలు నిర్వ హించి తదనంతరం దీపావళి పర్వదినం సంద ర్బంగా 6 ఏళ్ళు నరకాసురవధ కార్యక్రమాన్ని విజయ వంతంగా నిర్వహించుకున్నామని అన్నారు. ప్రతి దసరా రోజున నిర్వహించే రావణవధ కార్యక్రమాన్ని నిర్వహించే కార్యక్రమానికి ఆసక్తిగల వారు రూ.10 వేల శాశ్వత సభ్యత్వం పొందిన వారిని స్వాగత సమి తిలో చేర్చనున్నట్లు తెలిపారు. ఈ దసరాకు రావణాసుర వధ కార్యక్రమాన్ని ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహి స్తున్నట్లు కుమార్ వెల్లడించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఓడ రాజుగౌడ్, రసమల్ల శివాజీ బాణాల రాజు కుమార్ గుండె బోయిన రమేష్, ఎల్కతుర్తి శ్రీహ రి, మాధారి జనార్దన్, గాధం దేవేందర్, కోయిల మహేష్ ,మర్రి అంకుస్, యాదా సంపత్, మాదం సాగర్ చల్లూరు మహేందర్, ప్రధాన కార్యదర్శి ఇమ్మడి రాకేష్ యాదవ్ దొంతితరెడ్డి రాకేశ్ రెడ్డి, అచ్చునురి కిషన్, కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్ బొమ్మగాని ప్రభాకర్, శ్రీరంలా రామకష్ణా భూమా నరేష్ , మేకల రమేష్, జక్కుల కుమారి యాదవ్, శీలమంత్రం నరసింహాచారి, సహాయ కార్యదర్శి చిక్కుల రాకేష్ పోతుల రమేష్ పాఠ్య చంటి, తదితరులను నియమించారు.