Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
రాష్ట్రంలో పేదలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించిన జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ఆదిత్య ఆస్పటల్ కు, వైద్యులకు ఉత్తమ అవార్డులు దక్కాయి. ఆదివారం హైదరాబాద్‌లోని మేరీ గోల్డ్ హౌటల్ అమీర్‌పేటలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు చేతుల మీదుగా ఆదిత్య ఆస్పటల్ నిర్వాహకులు జైన రమేష్, ఉత్తమ సేవలు అందించిన డాక్టర్ కల్నాల్ లిమాచర్ల బిక్షపతి అవార్డును అందుకున్నారు. అతిథులు జీ తెలుగు ఛానల్ ఎడిటర్ భరత్, ప్రముఖ సినీ రచయిత విజ యంద్ర ప్రసాద్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ జీవితా రాజశేఖర్ కలిసి అభినందించారు అవార్డు పొందడం చాలా ఆనందం గా ఉఉందని. కల్నల్ బిక్షపతి అన్నారు. కార్యక్రమంలో జనగామా ఆదిత్య హాస్పిటల్ యాజ మాన్యం ఎం బద్రీనాధ్, దోర్నాల రమేష్, కసాబు రాజేష్, కృష్ణ, బుక్కల శ్రీనివాస్, సాయి, రవి కిరణ్, హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.