Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన పక్షపాతి అని మండల టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పసుమర్తి సీతారాములు తెలిపారు. ఆదివారం స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 10 శాతం రిజర్వేషన్ పెంచుతూ తీర్మానం చేయడం, గిరిజన బంధు, పోడు భూములకు పట్టాలు, హైదరాబాద్లో సంత్ సేవాలాల్ భవనం, కొమరం భీమ్ భవనాల ప్రారంభోత్సవ సందర్భంగా చేసిన ప్రకటనలతో గిరిజనులు, పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల మధ్య పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో గిరిజన జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ధరావత్ రాజేష్ నాయక్, ధరావత్ జై సింగ్, పాలకుర్తి సంత్ సేవాలాల్ కమిటీ ఉపాధ్యక్షుడు, స్థానిక కౌన్సిలర్ శంకర్, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.