Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్
నవతెలంగాణ-మబూబాబాద్
సాంంస్కృతీసాంప్రదాయాల్లో ఇమిడి ఉన్న గౌరవాన్ని చాటి చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ సాంస్కతిక వేడుకలు నిర్వహిస్తున్నదని ఎమ్మెల్లే బానోత్ శంకర్‌నాయక్, జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ముగిం పు సందర్భంగా ఆదివారం నందన గార్డెన్స్‌లో ఏర్పా టు చేసిన సాంస్కతిక వేడుకల్లో జెడ్పీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డితో కలిసి వారు పాల్గొని మాట్లా డారు. జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రో త్సవాల నిర్వహణలో భాగస్వాములైన జిల్లాస్థాయి మొదలుకొని గ్రామస్థాయి అధికారులు ప్రజాప్రతి నిధులు పోలిస్, మీడియాకు ధన్యవాదాలు తెలి పారు. సీఎం కేసీఆర్ ఆదివాసులు, గిరిజనులకు అద్భుతమైన వరాలు ఇచ్చారన్నారు. 10శాతం రిజర్వేషన్, పోడు భూములకు పట్టాలు, దళితబంధు మాదిరిగా గిరిజన బంధు ప్రకటించారన్నారు. హైదరాబాద్ మహానగరంలో సంత్ సేవాలాల్, కొమరం భీం భవనాలను ఏర్పాటు చేశారని చెప్పారు. గిరిజన విద్యాభివద్ధికి గిరిజన రెసిడెన్షి యల్ ఏర్పాటు చేసి ఉన్నత విద్యతోపాటు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నదని అన్నారు. జెడ్పీ చైర్పర్సన్ ఆంగొత్ బిందు మాట్లాడుతూ.. గిరిజను లకు 10 శాతం రిజర్వేషన్, గిరిజన బంధు నిర్ణయం పట్ల గిరిజన జాతి మొత్తం ముఖ్యమంత్రి వర్యులకు రుణపడి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పి శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్ అభి లాష అభినవ్, ట్రెయినీ కలెక్టర్ పరమర పింకేశ్వర్ కుమార్ లలిత్ కుమార్, అదనపు కలెక్టర్ ఎం డేవిడ్, తొర్రూరు మున్సిపల్ చైర్మెన్ రామచందర్ రావు, జెడ్పీటీసీ శ్రీనివాస్, ఎంపీపీ, జిల్లా గ్రామీణ అభివద్ధి అధికారి సన్యాసయ్య, జిల్లా సహకార అధికారి ఖుర్షీద్, డీఈఓ అబ్దుల్ హై, జిల్లా పరిషత్ సీఈవో రమాదేవి, జిల్లా సంక్షేమ అధికారి నర్మద ఆర్డీఓ కొమురయ్యచ, తదితరులు పాల్గొన్నారు.