Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ బీసీ సంక్షేమ సంఘం
- రాష్ట్ర కార్యదర్శి శాంతన్ రామరాజు
నవతెలంగాణ-మహబూబాబాద్
రిజర్వేషన్లు కోసం హక్కుల సాధన కోసం బీసీలు పోరాటాలకు సిద్ధం కావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శంతన్ రామరాజు పిలుపునిచ్చారు. ఆదివారం బీసీ హక్కుల సాధన, రాజకీయ రిజర్వేషన్లకై ఇల్లెందు రోడ్ లో ఉన్న పూలే జంక్షన్ లో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో శంతన్ రామరాజు పాల్గొన్నారు. పూలే విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈసందర్భంగా శంతన్ రామరాజు మాట్లాడుతూ విద్య, వైద్య, రాజకీయ రంగాల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని బీసీ మేధావులు, సంఘాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాల్సిన భాద్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. బీసీల్లోని119కులాల్లో ఆర్థికంగా సామాజికంగా తీవ్రమైన వ్యత్యాసం ఉండడంతో ఐక్యత లేకుండా పోతోందని అన్నారు. కుల గణన లేకుండా రిజర్వేషన్లు కల్పించొద్దని న్యాయస్థానాలు చెప్తున్నా పాలకులు మోసం చేస్తున్నారన్నారు. బీసీ హక్కుల కోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు బోనగిరి ఉపేందర్, గుంజె హనుమంతు, అందె భాస్కర్, గద్దోజు రామ్మూర్తి, కొండి సాయికిరణ్ నేత, తోట సురేష్, రాచకొండ నాగేందర్, కూన వెంకన్న, మైధం వీరన్న, నాలమాస విక్రం గౌడ్, త దితరులు పాల్గొన్నారు.