Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కేసముద్రం రూరల్
కార్మిక సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆకుల రాజు అన్నారు. ఆదివారం సీఐటీయూ మండల మహాసభ ఎండీ సలీమా బేగం అధ్యక్షతన జరిగింది. ఆకుల రాజు పాల్గొని మాట్లా డుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి ఎన్నికలు ముగిసిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమ య్యాయన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిత్యవసర సరుకులపై అధిక ధరలు పెంచి పేదలను ఇబ్బం దులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగా ఆస్తులను బడా పెట్టుబడి దారులకు కట్టబెడుతూ నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలను నిరు ద్యోగులను గందరగోళానికి గురి చేస్తున్నారని అ న్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి నిత్య వసర వస్తువులపై పెంచిన ధరలు తగ్గించాలన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని 57 సంవత్సరాలు దాటిన వారికి పింఛన్లు ఇవ్వాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసినారు. ఈ మహాసభలో కన్వీనర్ కమిటీని ఎన్ను కున్నట్టు తెలిపారు. కేసముద్రం మండలం కన్వీనర్ జల్లే జయరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జయరాజు మాట్లాడుతూ కార్మికుల ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. కమిటీ మెంబర్స్‌గా ఎండీ సలీమా బేగం, గాడిపెళ్లి ప్రమీల, దరావత్ లక్ష్మి, ఈదునూరు బుచ్చమ్మ పసునూరి కటాక్ష , చింతల వెంకటమ్మ, నామిండ్ల నాగేంద్ర, శ్రీనివాస్ తదితరులను ఎన్నుకున్నారు.