Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ రాష్ట్ర నాయకుడు బాబూ మోహన్
నవతెలంగాణ-రేగొండ
రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని బీజేపీ రాష్ట్ర నాయకుడు బాబుమోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జి చందుపట్ల కీర్తిరెడ్డి ఆధ్వర్యంలో తలపెట్టిన 'ప్రజాఘోష-బీజేపీ భరోసా' బైక్‌ర్యాలీకి బాబుమోహన్ ముఖ్యఅతిథిగా హాజరై మండలంలోని రూపిరెడ్డిపల్లిలో రామాలయంలో ప్రత్యేక పూజలు చేసి బైక్ ర్యాలీని ప్రారంభించగా బైక్‌ర్యాలీ రూపురెడ్డిపల్లి, చిన్నకొడెపాక, గోరికొత్తపల్లి, నిజాంపల్లి, కోనరావుపేట, సుల్తాన్పూర్, తిరుమలగిరి, జగ్గయ్యపేట, నారాయణపూర్, భాగిర్తిపేట, దుంపిళ్లపల్లి, గూడపల్లి, రేగొండలో సాగింది. ఈ సందర్భంగా బాబుమోహన్ ప్రసంగించారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివద్ధిని చూసి ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. తెలంగాణకు అనేక సంక్షేమ పథకాలను ఇస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. అనంతరం ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కీర్తిరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుటుంబపాలన సాగుతోందని మండిపడ్డారు. రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా కార్యకర్తలు పని చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెన్నంపల్లి పాపయ్య, మండల అధ్యక్షుడు దాసరి తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడునూతుల నిశిధర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రసాద్‌రావు, నాయకులు మనోహర్, రామచంద్రారెడ్డి, గణపతి, రాజు, మల్లేష్, రాకేష్, గణేష్, పోశాల రాజు, లింగారెడ్డి, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.