Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసు కె యాదవ్
- 'సామాజిక సంకుల సమరం' వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-మహాదేవ్‌పూర్
ఈనెల 25న మంథనిలో బహుజన సేన బహిరంగ సభ నిర్వహించనున్నట్టు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసు కె యాదవ్ తెలిపారు. 'సామాజిక సంకుల సమరం' సత్యశోధక్ సమాజ్ 150వ అవతరణ దినోత్సవాల ప్రత్యేక వాల్‌పోస్టర్‌ను మండల కేంద్రంలో కన్వీనర్ శంకర్ లాల్ ఆదివారం ఆవిష్కరించగా వాసు కె యాదవ్ మాట్లాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే సత్య శోధక్ సమాజ్ను స్థాపించి 150 ఏండ్లు గడచిన సందర్భంగా 2022-23 సంవత్సరాన్ని శూద్ర విముక్తి సంవత్సరంగా ప్రకటిస్తూ 150 కార్యక్రమాలు నిర్వహించ తలపెట్టినట్టు తెలిపారు. అందులో భాగంగా ఈనెల 25న సభ తలపెట్టినట్టు వివరించారు. సభకు ముఖ్య వక్తగా బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది డాక్టర్ కదిరె కృష్ణ పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీపతి బాపు, మండల దళిత నాయకులు లింగాల రామయ్య, పెండ్యాల మనోహర్, జాగృతి మహేష్, మెరుగు లక్ష్మణ్, వేమునూరి జక్కయ్య, ఆయిల్ల సమ్మయ్య, చిలుక రమేష్, మెరుగు శేఖర్, చకినారపు చందు, రేవెల్లి రాజశేఖర్, చాగర్ల రాజు, వడిజె రామకృష్ణ, చేకుర్తి శ్రీనివాస్, మోతం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.