Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్
- బిజెపిలోకి భారీగా చేరికలు
నవతెలంగాణ-పర్వతగిరి
కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలోని గ్రామాలు అభివద్ధి చెందుతునాయని మాజీ ఎమ్మెల్యే, బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ అన్నారు. మండలంలోని చింతనెక్కొండకు చెందిన పలు పార్టీల నాయకులు, యువకులు వంద మందికి పైగా ఆదివార కొండేటి శ్రీధర్ ఆధ్వర్యంలో బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు మేలుచేసే ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీని చూసి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో వరంగల్ జిల్లాలో పెద్ద సంఖ్యలో పార్టీలో చేరికాలు ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కుడికాల శ్రీధర్, మండల పార్టీ ఇంచార్జీ, దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బన్నా ప్రభాకర్, మండల అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్, ప్రధాన కార్యదర్శి బత్తిని దేవేందర్, ఉపాధ్యక్షులు వినోద్, యువమోర్చా మండల అధ్యక్షులు గొల్లపల్లి సంతోష్ కుమార్, సీనియర్ నాయకులు పిచ్చిరెడ్డి, గూడెల్లి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
బిజెపి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
ములుగు : నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధులను అవమానపరిచిన సీఎం కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షులు చిం తలపూడి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు ఇమ్మడి రాకేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేప ట్టారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చేసిన భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దాష్టీకాలకు వ్యతిరేక పోరాటాల ఫలితమే తెలంగాణ విమోచనం అన్నా రు. తెలంగాణ విమోచనం రోజున తెలంగాణ ప్రజలు ఊచ కోత కోసిన నిజాం పేరు చెప్పే దైర్యం లేని నీకు ముఖ్య మం త్రిగా కొనసాగే ఆర్హత లేదు అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి వాసుదేవ రెడ్డి, కార్యాలయ కార్యదర్శి చల్లూరి మహేందర్, జిల్లా అధ్యక్షులు జిలకల క్రిష్ణాకర్రావు యువ మోర్చా జిల్లా అధ్యక్షులు కొత్త సురేందర్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొంతి రెడ్డి రాకేష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కోయిల కవిరాజు, సీనియర్ నాయకులు అన్నపురెడ్డి ప్రమోద్ రెడ్డి, ప్రశాంత్ రరెడ్డి, జిల్లా కార్యదర్శ కల్లపు ప్రవీణ్, యువ మోర్చానాయకులు సాని కొమ్ము శ్రీనాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.