Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్పర్తి
బాలల హక్కుల పరిరక్షణ అందరి బాద్యత అని తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు అన్నారు. మండల కేంద్రం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ బాల అదాలత్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తహశీల్దారు పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. రేపు బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కలెక్టర్ కార్యాలయంలో బాలల సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదుల కోసం, హక్కులకు బంగం కలిగించే ఎటువంటి సమస్యలైనా పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామక్రిష్ణ, ఎంఈఓ రాంకిషన్రాజ్, సూపరింటెండెంట్ సునిల్, కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, ఐసీడీఎస్ సూపర్వైజర్ స్వరూప, అంగన్వాడీ టీచర్లు మేకల భాగ్య, అనిత, ఉమ, కమల, విమల, మహేశ్వరి, స్వరూప, రజనీ, తదితరులు పాల్గొన్నారు.
మడిపల్లిలో....
మడిపల్లి అంగన్వాడీ కేంద్రంలో పోషక ఆహార వారోత్సవాలు, బాలల సమస్యల పరిష్కార వేదిక బాల అదాలత్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ చిర్ర సుమలత విజరు హాజరై బాల అదాలత్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
అర్వపల్లిలో...
అర్వపల్లి అంగన్వాడీ కేంద్రంలో పోషక ఆహార వారోత్సవాలు, బాలల సమస్యల పరిష్కార వేధిక బాల అదాలత్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ తగరం జెనార్థన్ హాజరై ఈ నెల 21న కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే బాల అదాలత్ కార్యక్రమ పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజుకుమార్, వీఓ అనుష, చిరంజీవి, వినత, ఆశాలు కవిత, అంగన్వాడీ టీచర్లు రాధిక, జమునారాణి తదితరులు పాల్గొన్నారు.