Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ
వ్యవసాయ ఉపకరణాలపై జీఎస్టీని ఎత్తివేయాలని ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్, సహాయ కార్యదర్శి ఎన్రెడ్డి హంసారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 21న తలపెట్టిన చలో ఇందిరా పార్క్ కార్యక్రమ వాల్పోస్టర్లను హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్లో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేష్, హంసారెడ్డి మాట్లాడారు. రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు ఉచితంగా ఎరువులు, విత్తనాలు అందించాలని, లక్ష రూపాయల రుణమాఫీని తక్షణమే ఇవ్వాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 21న తలపెట్టిన చలో ఇందిరా పార్క్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు కుసుంబ బాబురావు, ప్రజాసంఘాల బాధ్యులు మంద భద్రయ్య, ఐతం నగేష్, దామెర సుదర్శన్, సుధాకర్, మొగిలి, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.