Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
పోషకాహారం తీసుకుంటేనే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని ఐసీడీఎస్ సూపర్వైజర్ జయప్రద తెలిపారు. మండలంలోని ముచినిపర్తిలో సర్పంచి నందికొండ కవిత అధ్యక్షతన అంగన్వాడీ టీచర్ పుష్ప సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో జయప్రద మాట్లాడారు. గర్భిణుల్లో, బాలింతల్లో, కిషోర్ బాలికల్లో, పిల్లల్లో పోషకాహార లోపాన్ని, రక్తహీనతను తగ్గించేందుకు తీసుకోవాల్సిన ఆహారం, ఆరోగ్యం, వ్యక్తిగత శుభ్రత పరిసరాల శుభ్రత, తాగునీటి ప్రాముఖ్యత గురించి వివరించారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, చిరుధాన్యాలను ప్రతిరోజు సమపాళ్లలో తీసుకుంటే పోషకాహార లోపాన్ని నివారించవచ్చని చెప్పారు. అనంతరం నలుగురు గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేష్, అంగన్వాడీ టీచర్లు తిరుపతమ్మ, త్రివేణి, కవిత, కనకలక్ష్మి, లావణ్య, హెల్త్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.