Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వెంకటాపురం
ఏజెన్సీలో గిరిజన చట్టాలను అమలు చేయలని కోరు తూ ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో స్థానిక కొమరం భీం విగ్రహం వద్ద దీక్షలు చేపట్టారు. దీక్షలకు మద్దతుగా సోమవారం ఆదివాసీ మహిళలు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఆనంతరం ఆదివాసీ నవనిర్మాణ సేన దీక్ష శిబిరం వద్దకు వెళ్లి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా బర్లగూడెం సర్పంచ్ కొరస నరసింహమూర్తి మాట్లాడుతూ ఏజన్సీ రిజర్వేషన్‌తో పదవులు పొందిన ప్రజాప్రతినిధులు ఏజన్సీ చట్టాల రక్షణకు పోరాటం చేస్తున్న వారికి మద్దతు ప్రకటించకుండా ఉండటం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆదివాసీలు కారం రాధ, అట్టం సుభద్ర,కాక గంగా భవాని,రామలక్ష్మి, ఆదివాసీ మహిళలు,ఆదివాసీ నవనిర్మాణ సేన నాయకులు కుర్షం విజయ్, కుంజ మహేష్,ఇర్ప బాబు, తదితరులు పాల్గొన్నారు.