Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెక్కొండ
చైల్డ్‌లైన్‌కు నిరుపేద స్థితిలో ఉండి భర్త కరోనా సమయంలో చనిపోవడంతో సరైనా పౌష్టికాహారం అందించలేక పోతుందని 1098 కు సమాచారం రావడంతో ఆ పాపకు నిత్యావసర సరుకులు బట్టలు పంపిణీ చేశారు. ఆపద సమయంలో 18 సంవత్సరాల లోపు ఉన్నటు వంటి బాలబాలికలు చైల్డ్ లైన్ సేవలు వినియోగించుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ వీరబాబు అన్నారు. చైల్డ్ లైన్ మండల ఇన్చార్జి రమేష్ దష్టికి రావడంతో వెంటనే కోఆర్డినేటర్ దష్టికి తీసుకెళ్లి వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎవరైనా నిరుపేదా స్థితిలో ఉండి చదువుకునే పిల్లలు ఉంటే 1098 కు సమాచారం అందించాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ వాసంతి చైల్డ్ లైన్ జిల్లా సభ్యులు మమత, హరీష్, అంగన్వాడి టీచర్ మంజుల ఆయమ్మ పాల్గొన్నారు.
పర్వతగిరి : 18 ఏళ్లలోపు బాల బాలికలు చైల్డ్ లైన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కో ఆర్డినేటర్ వీరబాబు తెలిపారు. మండలంలోని అన్నారం షరీఫ్‌లో ఇటీ వల కిడ్నాప్‌కు గురై దొరికిన ఎం.డి యూసఫ్ పిల్లలు తల్లిని కోల్పోయి దయనీయ స్థితిలో ఉన్నారని తెలుసుకుని వారికి అలాగే ఏనుగల్లులో ఇటీవలే తండ్రిని కోల్పోయిన నిరుపేద కుటుంబాల పిల్లలకు చైల్డ్ లైన్ ద్వారా నిత్యావసర సరుకులు, దుస్తులు అందించారు. కార్యక్రమంలో చైల్డ్ లైన్ జిల్లా సభ్యులు మమత, హరీష్, సాంబయ్య,మండల ఇంచార్జీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.