Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టాల కోసం దుగ్గొండి మండల గ్రామ రైతుల ఆవేదన
- పలుమార్లు కలెక్టర్ కు విజ్ఞప్తి చేసినా పరిష్కారం కానీ సమస్య
నవతెలంగాణ-వరంగల్
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం కన్నారావుపేట గ్రామ శివారులోని కొంతమంది రైతులకు ఉన్న భూము లకు పట్టాలు రాకపోయేసరికి చాలామంది రైతులు కలెక్టర్, ఆర్డిఓ తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేసినప్పటికీ కొత్త పట్టాలు ఇవ్వడానికి అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చాలాసార్లు ఉన్నతాధికారుల దగ్గరకు ఈ విషయం పరిష్కారంకై తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి స్పందన లేదని, చాలా మంది అధికారులు మారినప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా పట్టణ సమస్య మాత్రం పరి ష్కా రం కావడం లేదని రైతులు అనుకుంటున్నారు.కన్న రావు పేట, పద్మపురం, బుచ్చిరెడ్డిపల్లి, మూడు చెక్కులపల్లి, పంతులు పల్లి, అర్వపల్లి రైతులకు సంబంధించిన కొన్ని పట్టాలు ఇవ్వక మధ్యలో ఆపివేశారని, ఇదే విషయమై చాలా ఏళ్లు అయినప్పటికీ, ఇటీవల కలెక్టర్‌ను పలు మార్లు కలిసి వినతిపత్రం ఇచ్చినప్పటికీ రైతుల సమస్య మాత్రం పరి ష్కారం కావడం లేదని, అందువల్ల రైతులు చాలా నష్టపో తున్నామని వాపోతున్నామని, ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి కొత్త పట్టాలు ఇవ్వాలని పలువురు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
కొత్త పట్టాలు వెంటనే ఇవ్వాలి
- దేవేందర్ రైతు
కన్నారావుపేట గ్రామ శివారులో చాలామంది రైతు లకు భూములకు కొత్త పట్టాలు లేక పోయేసరికి భూ ములను అమ్మాలన్న, కొనాలన్నా, రైతుబంధు రావాలన్నా, ప్రభుత్వ పథకాలు తీసుకోవాలన్నా, బ్యాంకు రుణాలు తీసుకోవాలన్న తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. చాలా ఏళ్ల నుండి తిరిగినప్పటికీ కొత్త పట్టాలు రావడం ఆలస్యం అవుతుందన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి కొత్త పట్టాలు ఇప్పించాలి.