Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి
నవతెలంగాణ-జనగామ
టీఆర్ఎస్ ఎమ్మెల్యే, చైర్మెన్, కౌన్సిలర్ల పాలనలో జనగామ పట్టణ మున్సిపాలిటీ అభివద్ధికి శూన్యం అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. జనగామ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం బొట్ల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన పట్టణ కమిటీ సమావేశం లో కనకారెడ్డి పాల్గొని మాట్లాడారు. మున్సిపాలిటీ చైర్మన్ సీనియర్ మున్సిపాలిటీ చైర్మన్గా చెప్పు కుంటున్నా అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే అన్న చందంగా ఉందన్నారు. జనగామ మున్సిపాలిటీలో మురుగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. పట్టణ సుందరీకరణ పనులు నాలు గేండ్లుగా సాగుతున్నాయని, ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ సిగల్ సరిగా లేదని, నెహ్రూ పార్క్ నుండి సిద్దిపేటకు వెళ్లే బ్రిడ్జి పెచ్చులూడుతోందని ఆరోపించారు. బ్రిడ్జ్రి పై గుంతలు ఏర్పడి ప్రమాదాలకు దారితీస్తు న్నాయని, మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జోక్యం చేసు కోవడం వల్ల చైర్మన్, అధికారులు పనులు చేయ ట్లేదని ఆరోపించారు. మున్సిపల్ చైర్మన్ జనగామ అభివృద్ధి పట్ల చొరవ తీసుకోకపోతే రాబోయే రోజులలో పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అజారుద్దీన్, పట్టణ కమిటీ సభ్యులు పందిళ్ళ కళ్యాణి, పల్లెర్ల లలిత, బాల్నే వెంకటమల్లయ్య, కళ్యాణం లింగం, శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.