Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
ప్రజా సమస్యలను తప్పనిసరిగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ఆయన ప్రజా విజ్ఞప్తులు స్వీకరించారు. కూలి పనులు చేసుకుని జీవించే తమ 20 సంవత్సరాల కూతురు సింధు మానసిక దివ్యాంగురాలని, గతంలో మంజూరైన పింఛన్ రూ.1500 రావడం లేదని, ఆధార్ నంబర్ లేని కారణంగా నిలిపివేశారని, దివ్యాంగురాలు కావడంతో ఆధార్ నంబరు సాధ్యం కావడం లేదని, అధికారులు తగు చర్యలు తీసుకుని పింఛన్ మంజూరు చేయాలని పాలకుర్తి మండలం విస్నూర్ గ్రామానికి చెందిన వీరంకి శోభ మల్లేష్ విజ్ఞప్తి చేశారు. రఘునాథపల్లి మండల నిడిగొండ గ్రామానికి చెందిన లక్ష్మి నరసయ్య తన భార్యకు కళ్ళు కనిపించడం లేదని పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన అన్నబోయిన శిరీష తన భర్త మరణించారని, ఇద్దరు కూతుల్లున్నారని వితంతు పింఛన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి దరఖాస్తు సమగ్రంగా పరిశీలించి అర్హులకు తప్పక న్యాయం చేస్తామని చెప్పారు.
వసతి గృహాల్ని నిరంతరం పర్యవేక్షించాలి
విద్యార్థుల ఆరోగ్యంతోపాటు నాణ్యమైన విద్య అదేలా వసతి గృహాలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో పలు అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షిం చి కలెక్టర్ మాట్లాడారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటే నే విద్యను అభ్యసించగలరని చెప్పారు. విద్యార్థులు భోజనానికి ముందు చేతులు కడుక్కునే విధానాన్ని తెలియజేయాలన్నారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు అవుతు న్నాయా లేదా అన్నది పర్యవేక్షించాలని అన్నారు. బాలికల వసతి గహంలో 1098 ఫోన్ నెంబరు అందుబాటులో ఉంచాలన్నారు. భద్రతకు వాచ్మెన్ లను ఏర్పాటు చేస్తామన్నారు. సోప్ కిట్లు మంజూరు చేస్తామని, వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. నర్మెట వసతి గహాలను పర్యవేక్షించాలని ఆర్బీఎస్కె వైద్య సిబ్బందిని ఆదేశించారు. కాంపౌండ్ వాల్, గేట్లు డ్రైనేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటా మన్నారు. పెంబర్తి వసతి గహంలో చెత్త తరలింపు చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్డీఏ పీడీ రాంరెడ్డి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీవోలు మధుమోహన్, కృష్ణవేణి, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.