Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్
నవతెలంగాణ - చిన్నగూడూరు
నిరుపేదలకు అండగా సీఎం సహాయనిధి నిలుస్తుందని ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. మండలంలోని ఉగ్గంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే తన నివాసంలో సోమవారం నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసి ఆయన మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వల్లూరి వెంకట్ రెడ్డి, మరిపెడ మాజీ కో ఆప్షన్ అయుబ్ పాషా, బంటు ఉపేందర్, సర్పంచ్ మల్లయ్య, రాము, వార్డు సభ్యులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.