Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
జాతీయస్థాయి కరాటే పోటీల్లో పాలకుర్తి విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఆదివారం హైదరాబాద్ యూసఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో సుమన్ షాటోకాన్ కరాటే ఫౌండర్ బి సైదులు ఆధ్వ ర్యంలో కల్నల్ సంతోష్ బాబు స్మారక జాతీయస్థాయి కుంగ్ ఫు కరాటే చాం పియన్షిప్ పోటీలు నిర్వహించారు. పాలకుర్తి విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరచడంతోపాటు బంగారు, వెండి, కాంస్య పథకాలు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. సోమవారం న్యూ స్టార్ కుంగ్ ఫు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుగ్గిళ్ళ దేవేందర్ విలేకర్లతో మాట్లాడారు. జాతీయస్థాయి కరాటే పోటీల్లో స్పార్కింగ్ జూనియర్, సీనియర్ విభాగంలో పతకాలు సాధించి పాలకుర్తికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారన్నారు. కాగా ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, జెడ్పీ ఫ్లోర్ లీడర్ పుస్కూరి శ్రీనివాస రావు, జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండి మదర్, సిద్ధార్థ విద్యాలయం కరస్పాం డెంట్ జక్కుల రవీందర్, పాలకుర్తి గ్రామపంచాయతీ కో ఆప్షన్ సలేంద్ర రమ సోమన్న కలిసి ప్రతిభ కనబర్చిన విద్యార్థులను మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బహుమతులు అందజేసి అభినందించారు.