Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
రజకుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని చాకలి ఎస్సీ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు గోపరాజు సాంబలక్ష్మి, జిల్లా యూత్ అధ్యక్షుడు పసునూటి శంకర్ విమర్శించారు. మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. రజకులను ఎస్సీ కులంలో కలపాలని రాష్ట్ర అధ్యక్షురాలు కొత్తకొండ శ్రీలక్ష్మి అనేక ఏండ్లుగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. చాకలి కులస్తుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. అనంతరం మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా ఎన్నిండ్ల శంకర్, ఉపాధ్యక్షుడుగా వంచనగిరి అశోక్, ప్రధాన కార్యదర్శిగా రామడుగు కుమార్, కార్యదర్శిగా పసునూటి పరమేష్, కోశాధికారిగా పసునూటి శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడుగా పసునూటి వెంకటేష్, మహిళా విభాగం అధ్యక్షురాలుగా పసునూటి మణెమ్మ, ఉపాధ్యక్షులుగా ఎన్నిండ్ల రజిత, వడ్డేపల్లి శ్రీలత, ఎన్నిండ్ల మంజుల, పసునూటి సౌమ్య ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వావిలాల కోమల, ఎదుల శేఖర్, పసునూటి వెంకన్న, సమ్మయ్య, వైనాల భాస్కర్, నేరెళ్ల సారయ్య, పసునూటి రాజు, తదితరులు పాల్గొన్నారు.