Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్కతుర్తి
పత్తి పంటలో గులాబీ రంగు పురుగును అరికట్టాలని ఏడీఏ దామోదర్‌రెడ్డి సూచించారు. మండలంలోని జీల్గుల గ్రామంలో పత్తి సస్యరక్షణలో భాగంగా రైతులకు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ దామోదర్‌రెడ్డి మాట్లాడారు. గులాబీ రంగు పురుగు పూత దశలో ప్రారంభమై కాయ మొత్తం తిని లోపల పత్తి లేకుండా చేస్తుందన్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా ఎకరాకు 6 లింగాకర్షణ బుట్టలను పెట్టాలలని, గులాబీ రంగు పురుగు ఉధతమైనప్పుడు మాత్రమే రసాయన ఎరువులు పిచికారి చేయాలని సూచించారు. ఏమో మోక్టీన్, బెంజోయెట్, నాలుగు గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు. క్రోరాంత నిలిపోల్, మూడు గ్రాములు నీటర్ నీటిలో, కలిపి పిచికారి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఏఓ మండల రాజ్‌కుమార్, ఏఈఓలు పంజాల రాజు గౌడ్, తిరుపతి, మోతె కళ్యాణి, రోజ, రాశి సీడ్స్ కంపెనీ ప్రతినిధి హరీష్, రైతులు పాల్గొన్నారు.