Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే రాజయ్య టీఆర్ఎస్లో చేరికలు
నవతెలంగాణ-కాజీపేట
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. 46వ డివిజన్ కార్పొరేటర్ మునిగల సరోజన కరుణాకర్ ఆధ్వర్యంలో రాంపూర్ గ్రామానికి చెందిన కాంగ్రేస్, బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్లో సోమవారం చేరగా వారికి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పార్టీ కండువా కప్పి ఆహ్వానించి మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, దళితుల సమగ్రాభివద్ధికి దళితబంధు పథకాల దేశానికి ఆదర్శం అన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాంగోపాల్‌రావు, అర్షనపల్లి విజయకుమార్రావు, మండల అధ్యక్షుడు మునిగాల రాజు, ఉపాధ్యక్షుడు తక్కల్లపల్లి దేవేందర్‌రావు, గ్రామ శాఖ అధ్యక్షుడు మరగొని రవి, డివిజన్ కార్యదర్శి మాధవరావు, డివిజన్ అధ్యక్షుడు బోల్లికొండ వినోద్, బండి రవి, చెన్నురి రవీందర్, తక్కళ్లపల్లి మధురావు, పిట్టల రమేష్, చందరాజు సునీల్, శ్రీనివాస్, కడారి దేవేందర్, కుమార్, సండ్రా శ్రీను, సురేష్, డానియల్, మదశి యాదగిరి, రమేష్, సంబరజు, యాదగిరి, తిరుపతి, వెంకటేష్, మునిగాల యాకూబ్, గడ్డం సదానందం తదితరులు పాల్గొన్నారు.