Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌గా ఎన్నికైన బుర్ర రమేష్ గౌడ్ కలెక్టర్‌లో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల, శాలువాతో సత్కరించారు. అలాగే ఎస్పీ సురేందర్‌రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ దివాకరలను కూడా వారి కార్యాలయాల్లో మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని గ్రంథాలయంలో మౌలిక వసతులు, ఇతర సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. జిల్లా గ్రంథాలయ అభివద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రకటనలను అంచెలంచెలుగా విడుదల చేస్తున్న క్రమంలో జిల్లాలోని గ్రంథాలయాల్లో అవసరమైన పుస్తకాలను నిరుద్యోగులకు ఉపయోగపడేలా ఉండేలా చూడాలని సూచించారు ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు, పీఏసీఎస్ చైర్మెన్ మేకల సంపత్, టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ కటకం జనార్ధన్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు సిద్దు, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు బుర్ర రాజు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కోల రాజమల్లు, యూత్ నాయకుడు జిప్ ప్రేమ్, టీఆర్ఎస్వీ జిల్లా నాయకులు సేగ్గం దినేష్, కౌన్సిలర్ బుద్ధి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.