Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
టీఎస్ జెన్కో ఉపరితల బొగ్గుగని హద్దు నుంచి 500 మీటర్లు డేంజర్ జోన్లో ఉన్న 2011-13 వరకు అప్పటి ఏపీ జెన్కో అధికా రులు డేంజర్ జోన్లో ఎపి జెన్కో పేరుతో నెంబర్లు వేసిన పూర్వపు ఇండ్లను, వారి కుమారులు, కుమార్తెలు నూతనంగా నిర్మించుకున్న నూతన నివాసాలకు డిఎన్ డిడి పబ్లిక్ నోటీపీకేషన్ ప్రకటించాలని భూనిర్వాసితులు సోమవారం సంతకాల సేకరణలో వెళ్లి జిల్లా కలెక్టర్ భవేస్ మిశ్రాకు వినపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడారు. ఇటీవల భూ నిర్వాసితులు, భూ నిర్వాసిత కమిటీ గ్రామంలో సమావేశమై పూర్వపు నివాసాలను, అదికూడా పది సంవత్సరాల క్రితం ఎపి జెన్కో అధికారులు నెంబర్లు వేసి, సామాజిక, ఆర్థిక, సర్వేలు నిర్వహించిన ఇండ్లు, ఇటీవల తమ కుమార్తెలు, కుమారులు వివాహాలు చేసుకొని నిర్మించుకున్న ఇండ్లకు పబ్లిస్ నోటీపీకేషన్ కోసం ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్టు చెప్పారు. వెంటనే పబ్లిస్ నోటీపీకేషన్ వేయాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో భూనిర్వాసితుల కమిటీ అధ్యక్షుడు దండు రమేష్, ఇందారపు చంద్రయ్య, కేశారపు చంద్రయ్య, రామిడి గట్టయ్య, అక్కపాక సమ్మయ్య, ఆర్ని సత్యనారాయణ, రాజేశ్వర్‌రావు, అశోక్‌రావు, అజ్మత్ అలీ, తదితరులు పాల్గొన్నారు.