Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ మందల లావణ్య సాగర్‌రెడ్డి
- ప్రజాప్రతినిధులు సమన్వయం పాటించాలి
- జెడ్పీ వైస్ చైర్పర్సన్ శోభ రఘుపతిరావు
నవతెలంగాణ-భూపాలపల్లి
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తూ మండల సమగ్ర అభివద్ధికి కషి చేయాలని, జిల్లాలో భూపాలపల్లి మండలాన్ని అభివద్ధిలో మొదటి స్థానంలో ఉంచాలని ఎంపీపీ మందల లావణ్య సాగర్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లావణ్య అధ్యక్షతన మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయం, ఉద్యానవనం, వైద్య ఆరోగ్యం, విద్యుత్, మిషన్ భగీరథ, తదితర శాఖల ద్వారా మండలంలో చేపట్టిన అభివద్ధి, సంక్షేమ పథకాల ప్రగతిని సంబంధిత శాఖల అధికారులు సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు మిషన్ భగీరథ విద్యుత్ సమస్యలపై సంబధిత అధికారులను నిలదీశారు. రాంపూర్, నందిగామ, సుబ్బక్కపల్లి గ్రామ సర్పంచ్‌లు అధికారుల పట్ల ఊదసీనంగా వ్యవహరించడంతోనే బాధ్యతగా పని చేస్తలేరని, పనులు చేయించే విధంగా వారిపట్ల వ్యవహరించాలని ఎంపీపీ లావణ్యను కోరారు. విద్యుత్ శాఖ అధికారితో ప్రజా ప్రతినిధుల మధ్య వైరం జరుగుతుండగా, తహశీల్దార్ ఇక్బాల్ కల్పించుకొని సద్దుమనిగేలా చేశారు. నేరేడుపల్లి గ్రామ సర్పంచ్ రమాదేవి మాట్లాడుతూ.... గ్రామంలో ఏడు విద్యుత్ స్థంబాలకు సంబంధించిన విద్యుత్ వైరు దొంగిలించబడిందని, పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. విద్యుత్ వైరు దొంగిలించడంతో పొలాలకు సాగునీరు లేక ఎండి పోతున్నాయని, అధికారులు స్పందించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని కోరారు. అనంతరం జెడ్పీ వైస్ చైర్మెన్ కళ్లెపు శోభ మాట్లాడుతూ అధికారులు నిబద్ధతతో పనులు పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా విద్యుత్ శాఖ, మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలున్నాయని, విద్యుత్ శాఖ అధికారులు నిరంతరం విద్యుత్ అందించాలని, భగీరధ శాఖ అధికారులు గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి శుద్ధమైన త్రాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ అనిల్ కుమార్, తహసీల్దార్ ఇక్బాల్, పీఏసీఎస్ చైర్మెన్ మేకల సంపత్‌కుమార్ యాదవ్, వైస్ ఎంపీపీ సముద్రాల దీపారాణి శ్రీనివాస్, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఆయా శాఖల మండల అధికారులు, ఎంపీడీఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.