Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
మండలంలోని రాజుతండాలో డెంగ్యూతో బాధపడుతున్న విద్యార్థినిని జిలా డిప్యూటీ డీఎంహెచ్ఓ అంబరీష జిల్లా, మండల వైద్య అధికారులతో కలిసి మంగళవారం పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాజు తండాకు చెందిన మాళోత్ అంజలి ప్రియా హైదరాబాద్లో ఓ వసతి గృహంలో ఉంటూ డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతూ కొన్ని రోజుల కిందట డెంగ్యూ బారిన పడగా జిల్లా వైద్య బృందం బాధితురాలు ఇంటికి వెళ్ళి అరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. డెంగ్యూ జ్వరం పట్ల భయం వద్దని వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలని సూచించారు. అనంతరం ఇంటి పరిసరాలను పరిశీలించి పైరత్రాం మందును స్ప్రే చేశారు. అనంతరం మండలంలోని పిక్లీ తండాలో గత ఏప్రిల్లో బాలింత జాటోత్ స్వాతి మృతిచెందగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా,మండల అధికారులు సుధీర్ రెడ్డి, మందుల శ్రీ రాములు,కష్ణార్జునరావు,శ్రీనివాస్,విరాజీత, ఇస్మాయిల్, రాధాకష్ణ, తదితరులు పాల్గొన్నారు.