Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్
నవతెలంగాణ-కాశిబుగ్గ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్ డిమాండ్ చేశారు. మంగళవారం కాశిబుగ్గలోని వివేకానంద జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సదస్సులో ప్రశాంత్ మాట్లాడారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని అన్నారు. దీంతో సామాన్య విద్యార్థులు ఎలా చదువుకుంటారని ప్రశ్నించారు. డిగ్రీ కోర్స్ 3 నుండి నాలుగు సంవత్సరాలకు పెంచడాన్ని వ్యతిరేకిస్తు న్నట్లు తెలిపారు. ఇప్పటికే విద్యలో అమ్మాయిల సంఖ్య చాలా తగ్గుతుందని ఇప్పుడు డిగ్రీ 4సంవత్సరాలకు పెంచడం వల్ల అమ్మాయిల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉన్నదన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించు కోవాలని కోరారు. ప్రైవేట్ యూనివర్సిటీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. శాస్త్రీయ విద్యా విధానాన్ని తొలగించి ఆశాశ్రీయ భావజాలాన్ని విద్యార్థుల్లో తీసు కురావడానికి నూతన విద్యా విధానం అమలు చేస్తు న్నారని మండిపడ్డారు. మతం పేరుతో రాజకీ యాలు చేస్తూ విద్యార్థుల మధ్య ఘర్షణలు సష్టించే విధానానికి ఎస్ఎఫ్ఐ పూర్తిగా వ్యతిరేకమన్నారు. నూతన విద్యా విధానాన్ని రద్దు చేసే వరకు విద్యార్థుల పక్షాన ఐక్య పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. మొదటగా కేంద్రం ఇస్తానన్న రెండు కోట్ల ఉద్యోగాలు, బడ్జెట్లో విద్యారంగానికి 10 శాతం నిధులు కేటాయించి విద్యార్థుల గురించి మాట్లాడా లన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు కార్తీక్, శివకుమార్, సాయి కష్ణ, తదితరులు పాల్గొన్నారు.