Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిష్కారంలేని సభ నిర్వహన ఎందుకంటూ నిలదీత
నవతెలంగాణ-నర్సంపేట
మండల సభకు అధికారులు గైహాజరు కావడంపై ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఎంపీపీ మోతె కలమ్మ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పలు శాఖల అధికారులు హాజరు కాలేదు. సమావేశం ప్రారం భంలో ఇటికాలపెల్లి, రాజుపేట ఎంపీటీసీ భూక్య వీరన్న, బాధవత్తు వీరన్న మాట్లాడుతూ సమస్యలను ప్రస్తావించి అధికారులచే పరిష్కారం చేసుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్యమైన శాఖలకు చెందిన అధికారులు హాజరు కాకపో వడంపై ఇన్చార్జి ఎంపీడీవో సునిల్ కుమార్ను నిలదీశారు. అన్ని శాఖల అంశాలను ఏజెండాలో చర్చించడానికి అధికారులు లేకపోతే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. కిందటి సారి పలు సమావేశాల్లో లేవనెత్తిన సమస్యలు, తీర్మాణాలు జిల్లా కలెక్టర్కు నివేదించి వాటి పరిష్కారం అయ్యేలా ఎందుకు కృషి చేయలేదన్నారు. తక్షణమే సమావేశానికి గైహాజరైన అధికారులపై చర్యలు తీసుకోనేందుకు కలెక్టర్కు తీర్మాణం పంపించాలని సూచించారు. రామవరం సర్పంచ్ కొడారి రవి మాట్లాడుతూ పల్లె ప్రకృతి, శ్మశానవాటిక, డంపింగ్ యార్డులు ఇతర గ్రామా భివృద్ధి పనులను చేసి సర్పంచ్లు బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వెంటనే రికార్డులు చేసి అధికారులు బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. లక్నెపల్లె గ్రామంలో గ్రామ పంచా యతీకి చెందిన భూమిని మాదారపు చంద్రశేఖర్ అనే వ్యాపారి చేతికి వెళ్లిందని అడ్డదారిలో కొందరు రిజిస్టేషన్ చేసుకొని అమ్ముకున్నారని తెలిపారు. ఇట్టి భూమిని రక్షించాలని పలు మార్లు కోరినా రెవిన్యూ అధికారులు పట్టించుకోకపోవడం సమంజసం కాదన్నారు. సమావేశంలో ఎంపీటీసీలు, సర్పంచ్లు పలు సమస్యలను ప్రస్తావించారు.తహసిల్దార్ వీ.రాంమూర్తి, ఇన్చార్జి ఎంపీడీవో సునిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.