Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'నవతెలంగాణ'కు స్పందన
- మండల అధికారులకు కలెక్టర్ అక్షింతలు
- ప్రత్యేక వైద్యశిభిరం
- పారిశుధ్య పనులు ముమ్మరం
నవతెలంగాణ-మంగపేట
'మంచం పట్టిన రాజుపేట' శీర్షికతో 'నవతెలంగాణ'లో ప్రచురితమైన కథనానికి జిల్లా, మండల అధికారులు స్పందించారు. రాజుపేట ఎస్సీ కాలనీలోని దళిత కుటుంబాలు డెంగ్యూ, విషజ్వరాలతో పడుతున్న బాధలను కళ్లకు కట్టినట్లు చూపిన 'నవతెలంగాణ' కథనానికి జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి స్పందించి మండల అధికారులకు అక్షింతలు వేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో హుటాహుటిన కదిలిన ఎంపీఓ పొదిల శ్రీనివాస్, గ్రామపంచాయతీ కార్యదర్శి ఉపేంద్ర పంచాయతీ సిబ్బందితో రాజుపేట ఎస్సీ కాలనీలో పారిశుధ్య పనులు, బ్లీచింగ్, యాంటీ లార్వా స్ప్రే, డ్రైనేజీల్లో ఆయిల్ బాల్స్ వేసి దోమల నిరోధక చర్యలు చేపట్టారు. ఎస్సీ కాలనీలో వీధులన్నీ దుర్ఘంధంగా ఉండడటంతో 80 ఇళ్లలో ప్రత్యేక పారిశుద్య పనులు చేపట్టేందుకు సుమారు 30 మంది సిబ్బందితో పిరిశుద్య పనులు చేపట్టనున్నట్లు ఎంపీఓ శ్రీనివాస్ 'నవతెలగాణ'కు తెలిపారు. బ్రాహ్మణపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి మంకిడి ట్వింకల్ నిఖిత ఆధ్వర్యంలోని వైద్య సిబ్బంది ఎస్సీ కాలనీలో ప్రత్యేక వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేసి 44 మందికి పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందజేశారు. పరీక్షల్లో 10 మందికి సాదారణ జ్వరాలు, 6 గురికి డెంగ్యూ జ్వరాలు, ముగ్గురికి జలుబు, దగ్గు, నల్గురికి చర్మ సంబందిత వ్యాదులున్నట్లు గుర్తించి ఉచిత మందులు అందజేశారు. కాలనీలో సోమవారం నుండి ఐదు రోజుల పాటు వైద్య శిభిరాన్ని కొనసాగిస్తున్నట్లు వైద్యాధికారులు ట్వింకిల్ నిఖిత, అనీష్ తెలిపారు. కార్యక్రమంలో ఏఎన్ఎం అరుణ,ఆశలు విజయ, పుణ్యవతి, హెల్త్ అసిస్టెంట్ పొదెం రవి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.