Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్
నవతెలంగాణ-హసన్‌పర్తి
ఆసరా పింఛన్ ద్వారా పేదలకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలిపారు. 1, 2వ డివిజన్లకు చెందిన 438 మంది నూతన ఆసరా పెన్షన్లబ్ధిదారులకు గుర్తింపు కార్డులను ఎర్రగట్టుగుట్ట బాలాజీ గార్డెన్స్‌లో ఎమ్మెల్యే అరూరి రమేష్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసరా పెన్షన్పథకం ద్వారా వృద్ధుల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కండ్లల్లో ఆనందం చూడటమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 12 వేల కోట్ల రూపాయలను పింఛన్ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల సంఖ్య అరకోటికి చేరిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పెన్షన్లు ఇస్తున్న దాఖలాలు లేవన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. వద్ధాప్య పెన్షన్ వయస్సును 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 10 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరై నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ జోన, కార్పొరేటర్ అరుణకుమారి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బండ రజనీకుమార్; మార్కెట్ డైరెక్టర్ వీసం సురెందర్‌రెడ్డి, రైతు బందు మండల కన్వినర్ అంచూరి విజరుకుమార్, మాజీ కార్పొరేటర్ బానోతు కల్పన, పీఏసీఎస్ చైర్మన్ మేరుగు రాజేష్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు జంగ కుమార్‌యాదవ్, దోమ కుమార్, మూల దేవెందర్‌గౌడ్, ప్రజా ప్రతినిధులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.