Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీతక్క చిత్రపటానికి పాలాభిషేకం
నవతెలంగాణ-మంగపేట
ఏజెన్సీ నక్సల్స్ ప్రభావిత (ఎల్డబ్యు) మండలంలోని 14 గ్రామాల్లో సుమారు రూ.7 కోట్లతో రోడ్ల నిర్మాణానికి ములుగు ఎమ్మెల్యే సీతక్క నిధులు మంజూరీ చేయడం పట్ల మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు మైల జయరాంరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం మండల కేంద్రంలో సీతక్క చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా జయరాంరెడ్డి మాట్లాడుతూ మండలంలో రోడ్డు పనులు చేపట్టనున్న గ్రామాల వివరాలను వెల్లడించారు. తిమ్మాపూర్ నుండి ముసలమ్మగుట్ట గూడెం వరకు, తిమ్మాపూర్ నుండి రాళ్ల గుంపు వరకు, ఆర్ అండ్ బి రోడ్డు నుండి క్రింది బ్రాహ్మణపల్లి వరకు, సంగంపల్లి నుండి పిఆర్ రోడ్డు వయ పాత చీపురుదుబ్బ వరకు, కమలాపురం నుండి రేగులగూడెం వరకు, కోమటిపల్లి రోడ్డు నుండి శాంతినగర్ గొత్తికోయగూడెం వరకు, కోమటిపల్లి రోడ్డు నుండి పోచమ్మగూడెం గొత్తికోయగూడెం వరకు, దోమెడ నుండి పాలాయిగూడెం వరకు, రాజుపేట రోడ్డు నుండి కొత్త చీపురుదుబ్బ వరకు, కొత్తపేట జంగాలగుంపు కాలనీ నుండి తిమ్మంపేట వరకు, నీలాద్రిపేట నుండి ప్రాజెక్టునగర్ గొత్తికోయగూడెం వరకు, నర్సింహాసాగర్ నుండి గొందిగూడెం వరకు, మణుగూరు ఏటూరునాగారం రోడ్డు నుండి నడిమిగూడెం వరకు, తిమ్మంపేట బీసీ కాలనీ నుండి చెరుపల్లి తిమ్మంపేట రోడ్డు వరకు నూతన రోడ్ల నిర్మాణానికి నిధులను ములుగు ఎమ్మెల్యే సీతక్క చొరవ వల్ల మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ధీగొండ కాంతారావు, మహిబూబ్ ఖాన్, ఉజ్వల్, తూడి భగవాన్‌రెడ్డి, అయ్యోరి యానయ్య, కొంకతి సాంబశివరావు, మైప లాలయ్య, కాటబోయిన నర్సింహారావు, పల్లికొండ యాదగిరి, చాద మల్లయ్య, ముత్తినేని ఆదినారాయణ, మురుకుట్ల నరేందర్, కర్రి నాగేంద్రబాబు, హిధాయతుల్లా, జంగం భానుచందర్, చెట్టుపల్లి ముకుందం, కుర్సం రమేష్, నర్రా కిషోర్, దామెర సారయ్య, కారుపోతుల నర్సయ్య, మాచిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.