Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఐనవోలు
అర్హులైన గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీకి బదులు నగదీ బదిలీ చేయాలని జీఎంపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాడబోయిన లింగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ ఏశారు. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఫంక్షన్ హాలులో పిడుగు దయాకర్ అధ్యఓతన మంగళవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా లింగయ్య హాజరై మాట్లాడారు. పథకంలో భాగంగా అర్హులకు 75 శాతం సబ్సిడీతో 21 గొర్రెలు ఇస్తామని చెప్పినట్టు తెలిపారు. జిల్లాలో 21 వేల 88 మందిని ఎంపిక చేసి అందులో 13 వేల 740 మందికి మాత్రమే ఇచ్చినట్టు తెలిపారు. రెండో విడతలో 21 చొప్పున గొర్రెలు పంపిణీ చేయాల్సి ఉండగా 9 నుండి 15 మాత్రమే పంపిణీ చేయడంతో గొల్లకుర్మలు నష్టపోయారని చెప్పారు. పంపిణీ చేసిన గొర్రెల్లో ముసలి, నాసిరకం గొర్రెలున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. సర్పంచ్ బండి పర్వతాలు మాట్లాడుతూ గొల్లకుర్మలకు సీపీఐ(ఎం) అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కూస చిరంజీవరెడ్డి,గ్యాదరి భాస్కర్ మాట్లాడుతూ గ్లొలకుర్మల పోరాటం న్యాయమైనదని చెప్పారు. సమావేశంలో సంఘం జిల్లా కమిటీ సభ్యుడు బోయిని రాజు, మండల కార్యదర్శి నల్లబెట్ల చిన్న రాజు, సొసైటీ అధ్యక్షుడు ఉడత చేరాలు, మండల నాయకులు సంఘీ శ్రీను, ఉడుత భాస్కర్, నల్లబెట్ట రాజు, ఉడుత పెద్ద సమ్మయ్య, కావటి బద్వేలు తదితరులు పాల్గొన్నారు.